✍️ప్రశ్నపత్రాల కోసం పరుగులు!
♦️ప్రతిరోజూ ఎంఈవో ఆఫీసులకు హెచ్ఎంలు
♦️ఏకోపాధ్యాయ స్కూళ్లకు మరిన్ని కష్టాలు
♦️ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
♦️రాష్ట్రంలో సీబీఏ, ఎఫ్ఏ-1పరీక్షలు ప్రారంభం
*🌻అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి)*: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో బుధవారం నుంచి ప్రారం భమైన తరగతి ఆధారిత మదింపు(సీబీఏ), ఫార్మే టివ్ టెస్ట్(ఎఫ్ఎ) పరీక్షల విషయంలో ప్రశ్నప త్రాలు తెచ్చుకోవడంపై ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఎంఈవో కార్యాలయానికి పరుగులు పెట్టి ప్రశ్నపత్రాలు తెచ్చుకునే విధానంపై మండిపడుతున్నారు. గతంలో ఏడెనిమిది పాఠశాలలకు ఒక స్కూల్ను ఏర్పాటుచేసి, అక్కడినుంచి ప్రశ్నపత్రాలు సరఫరా చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంఈవో కార్యాలయాల్లో పెట్టడం వల్ల మండలంలోని ప్రతి పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు(హెచ్ఎం) అక్కడకు వెళ్లి పత్రాలు తెచ్చి పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 130 నుంచి 2.30 వరకు, 3 నుంచి 4 గంటల మధ్య జరు గుతున్నాయి. వీరికి సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వ హిస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఎఫ్ఎ విధానంలోనే ఉదయం 9.30 గంటల నుంచి 10.15 వరకు, 11 నుంచి 11.45 వరకు జరుగుతున్నాయి. అంటే, ప్రతి తరగతి విద్యార్థులు రోజుకు రెండు పరీ క్షలు రాస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి పరీక్ష అంటే సుమారు 8 గంటల సమయంలోనే ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ప్రశ్న పత్రాలు తేవాలి. అలాగే రోజుకు రెండు విడతలుగా పరీక్షలు ఉన్నవా రికి కొన్ని చోట్ల రెండు సార్లు వచ్చి పత్రాలు తీసుకె ళ్లాలని ఎంఈవో కార్యాలయాల సిబ్బంది చెబుతు న్నారు. దీంతో రోజుకు రెండుసార్లు ప్రశ్న పత్రాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఈ సరఫరా బాధ్యత తీసుకోవాలని, అయితే, ఉద్దేశపూర్వకంగానే హెచ్ఎంలపై ఈ బాధ్యత నెట్టారని వారు ఆరోపిస్తున్నారు. ఇక, ఏకోపా ధ్యాయ (సింగిల్ టీచర్) పాఠశాలల్లో టీచర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉన్న ఒక్క టీచర్ ప్రశ్నపత్రాలు తెచ్చుకోవడం. పరీక్షలు నిర్వహించడం అంటే మరింత ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
♦️ఓఎంఆర్ పై తికమక
తొలిసారి 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యా ర్థులు కొంత అయోమయానికి గురవు తున్నారు. ముఖ్యంగా ప్రాధమిక పాఠ శాలల్లోని విద్యార్థులకు ఓఎంఆర్ షీటులో బబ్లింగ్ చేయడం గందరగో కంగా ఉంది. కొందరు విద్యార్థులు ఎలా చేయాలో తెలియక బబ్లింగ్ అటూ ఇటు చేస్తున్నారు. దీంతో అలా బబ్లింగ్ చేసిన షీట్లు సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఒకటి రెండు పరీక్షల తర్వాత విద్యా ర్థులు సులభంగానే కొత్త విధానం అర్ధంచేసుకుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment