ఈ కార్డుతో ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ FREE!
ఇంధన ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో ఉన్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల ఆదాయం కొంత మేరకు పెరిగింది. కానీ ఇలాంటి టైంలో సంపాదించిన డబ్బులో చాలా వరకు పెట్రోల్, డీజిల్ ఖర్చులకే అయిపోతున్నాయి.
సొంత వాహనాల వాడకం క్రమంగా పెరుగుతున్న కొద్ది ఇంధన ధరలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 110 కి దగ్గరగా ఉంది. డీజిల్ ధర కూడా రూ. 100 కి దగ్గరగా ఉంది. చేతిలో ఉన్న డబ్బులలో ఎక్కువ భాగం వీటి ఖర్చులకే సరిపోతుంది. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాంకులు తమ కార్డులపై ప్రత్యేకమైన తగ్గింపులు అందిస్తున్నాయి. ముఖ్యంగా సిటీ బ్యాంక్ కొత్తగా Indianoil కార్పోరేషన్‌తో జతకట్టి 'Indianoil citi Credit Card' ను అందిస్తుంది. ఈ కార్డు ఉన్న వినియోగదారులు నెలకు సుమారు 5 లీటర్లకు పైగా ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చు.
Indianoil citi Credit Card ఉన్న కస్టమర్లు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో రూ.150 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తే 4 టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇంకా ఈ కార్డు ద్వారా రూ.150 ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఒక్క పాయింట్ వస్తుంది. అలాగే షాపింగ్‌లలో 2 పాయింట్లు వస్తాయి. ఇలా పాయింట్లను కలెక్ట్ చేసుకుని ఏడాదికి 68 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ పాయింట్ల ఆధారంగా బంకుల్లో ఇంధనం కొనుగోలు చేసే టైం లో తగ్గింపు లభిస్తుంది. కార్డును ఉపయోగించినప్పుడు పాయింట్లు తగ్గుతు ఇంధనం ఫ్రీ గా లభిస్తుంది.
0 Comments:
Post a Comment