✍️3,4,5 క్లాసులకు ఎస్ఏలు బోధించాలి
♦️అలా జరగనిపాఠశాలల హెచ్‌ఎంలపై చర్యలు
♦️జెడ్పీ పాఠశాల హెచ్ఎం. తెలుగు టీచర్‌కు షోకాజ్ నోటీసు
*🌻కొండపల్లి(ఇబ్రహీంపట్నం):* ప్రభుత్వ జెడ్పీ పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు ప్రభుత్వ టైమ్ బుల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు పాఠాలు బోధించాలని, అలా జరగని పక్షంలో సంబంధిత ప్రధానోపాధ్యాయు లపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ రీజ నల్ డైరెక్టర్ (కాకినాడ) దుక్కిపాటి మధుసూదన రావు హెచ్చరించారు. కొండపల్లి బాలుర, బాలి కల జెడ్పీ పాఠశాలలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలుర పాఠశాలలో జగనన్న విద్యాకానుక పంపిణీ సక్రమంగా లేదని గుర్తించారు. మూడు, నాలుగు, ఐదు తరగ తులకు సబ్జెక్ట్ టీచర్లు బోధించడం లేదని, తెలుగు ఉపాధ్యాయుడు అశోక్‌కు సబ్జెక్ట్‌పై అవగాహన లేదని తెలుసుకున్నారు. నూతన టైమ్ టేబుల్ అమలులో నిర్లక్ష్యం, జగనన్న విద్యా కానుక పం పిణీ సక్రమంగా లేకపోవడంపై హెచ్ఎం శేషగిరి రావు, తెలుగు ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీ సులు ఇచ్చారు. శాఖపరమైన చర్యలు తీసుకో వాలని డీఈఓకు ఆదేశాలు ఇస్తామన్నారు. అనం తరం బాలికల జెడ్పీ పాఠశాల రికార్డులు తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచాలని సూచించారు. జగనన్న విద్యా కానుక పంపిణీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. బాలి కల పఠనాశక్తిని పరిశీలించారు. బోర్డుపై కొన్ని ప్రశ్నలు రాసి ప్రతిభను పరిశీలించారు. ఇంగ్లిష్ టెక్స్‌బుక్స్ చదివించారు. విజయవాడ డీవైఈఓ కొండా రవికుమార్, ఎంఈఓ సీహెచ్ పుష్పలత పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment