10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 70 వేల వరకు జీతం!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచియున్న వారికి శుభవార్త. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ వంటి కేంద్ర రక్షణ సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
24,369 ఖాళీలు ఉన్నట్లు సదరు నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే తాజగా, ఆ పోస్టులకు అదనంగా మరో 20,915 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉండాల్సిన అర్హతలేంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? జీత భత్యాలు ఎలా ఉంటాయి? అన్న సమాచారం మీ కోసం..
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు: 45,284
బీఎస్ఎఫ్: 20,765
సీఐఎస్ఎఫ్: 5,914
సీఆర్పీఎఫ్: 11,169
ఎస్ఎస్బీ: 2,167
ఐటీబీపీ: 1,787
ఏఆర్: 3,153
ఎస్ఎస్ఎఫ్: 154
ఎన్సీబీ: 175
అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
మహిళా అభ్యర్థులు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
కొంతమంది అభ్యర్థులకు ఎత్తు విషయంలో సడలింపు ఉంది.
వయోపరిమితి: 01/01/2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ: 05 ఏళ్లు; ఓబీసీ: 3 ఏళ్లు; ఎక్స్-సర్వీస్ మెన్: 3 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది)
అలాగే..
1984 గుజరాత్ రియట్స్ లేదా 2022 కమ్యూనల్ రియట్స్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు: 5 ఏళ్లు (రిజర్వేషన్ లేని వారికి మాత్రమే)
1984 గుజరాత్ రియట్స్ లేదా 2022 కమ్యూనల్ రియట్స్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు: 8 ఏళ్లు (ఓబీసీ)
1984 గుజరాత్ రియట్స్ లేదా 2022 కమ్యూనల్ రియట్స్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు: 10 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ)
జీతభత్యాలు:
ఎన్సీబీలో సిపాయి పోస్టులకు నెలకు రూ. 18 వేల నుంచి 56,900 వరకు చెల్లిస్తారు.
మిగతా పోస్టులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకూ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఉంటుంది.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష
2. ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష
3. ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష
కంప్యూటర్ పరీక్ష విధానం: మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశాంకు రెండు మార్కుల చొప్పున 160 మార్కులు కేటాయిస్తారు.
(జనరల్ ఇంటిలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథ్ మెటిక్స్, ఇంగ్లీష్/హిందీ ప్రశ్నలు ఉంటాయి)
పరీక్ష సమయం: 60 నిమిషాలు
పరీక్ష తేదీ: జనవరి 2023
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో పరీక్షలు నిర్వహించబడును.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్:
పురుషులు 24 నిమిషాల్లో 5 కిమీల రేస్ ని పూర్తి చేయాలి.
మహిళలు 8 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కిమీల రేస్ పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు: రూ. 100/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30, 2022.
నోటిఫికేషన్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మునుపటి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)లో సిపాయి పోస్టులు.
గమనిక: ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.
0 Comments:
Post a Comment