Retirement Crisis: రానున్న రోజుల్లో ప్రస్తుత యువత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నితిన్ కామత్ అంటున్నారు.
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే సంక్షోభం కంటే.. రాబోతున్న పదవీ విరమణ సంక్షోభం చాలా పెద్దదని ఆయన హెచ్చరిస్తున్నారు.
నితిన్ కామత్ ప్రకారం..
మంది పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకోవాలని చాలా మంది ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. అయితే ఇకపై అది సూచన కాదు తప్పనిసరి అంటున్నారు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధాకు చెందిన నితిన్ కామత్.
సంపాదన ప్రారంభించిన నాటి నుంచే దీనిపై దృష్టి సారించాలని, అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అంటూ ట్వీట్ చేశారు. 40 ఏళ్లు దాటినవారు సైతం దీని గురించి పట్టించుకోవటం లేదని అన్నారు.
ఎందుకు ప్లానింగ్ అత్యవసరం..
రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గుతోందని నితిన్ కామత్ తెలిపారు. ఇదే సమయంలో వైద్య పురోగతి కారణంగా ఆయుర్దాయం పెరుగుతోందని అన్నారు.
దీని కారణంగా 50 ఏళ్లలో రిటైర్ అవుతున్నట్లయితే.. మనుషుల ఆయుర్ధాయం 80 ఏళ్లకు పెరుగుతోంది. అందువల్ల పదవీ వరమణ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు జీవించేందుకు ఆదాయం అవసరం ఉంటుందని అన్నారు.
25 ఏళ్లలో సంక్షోభం..
రానున్న 25 ఏళ్లలో ప్రస్తుత యువత భారీ రిటైర్ మెంట్ సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి వస్తుందని అంచనాలు చెబుతున్నాయి.
గతంలో రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్ ద్వారా మన పూర్వీకులు మంటి రిటైర్‌మెంట్ కార్పస్‌ను నిర్మించుకునే అవకాశాన్ని పొందారు. కానీ భవిష్యత్తులో ఇది అసంభవం అని తెలుస్తోంది.
కామత్ ప్లానింగ్ వ్యూహాలు..
రాబోతున్న ఈ అతిపెద్ద సంక్షోభం నుంచి బయటపడేందుకు కామత్ కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం యువత వీలైనంత త్వరగా డబ్బు ఆదా చేయటం ప్రారంభించాలని సూచించారు.
అయితే డబ్బు మెుత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టడానికి బదులు, దానిని అనేక భాగాలుగా విభజించి FDలు, ప్రభుత్వ సెక్యూరిటీల SIPలు, ఇండెక్స్ ఫండ్‌లు, ETFలలో పెట్టుబడి పెట్టటం మంచిదని చెబుతున్నారు. లాంగ్ టర్మ్ లో ద్రవ్యోల్బణాన్ని అధిగమింటే రిటర్న్స్ కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.
ఇన్సూరెన్స్ తప్పనిసరి..
అయితే ప్లానింగ్ లో భాగంగా కుటుంబం మెుత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పక తీసుకోవాలని ఆయన సూచించారు.
అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు దాచుకున్న డబ్బు ఖర్చుచేయాల్సి రాకుండా ఇది నివారిస్తుందని అన్నారు. ఎల్లప్పుడూ ఉద్యోగం ఉంటుందని గ్యారెంటీ ఉండదు కాబట్టి కంపెనీ నుంచి కాకుండా విడిగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని హెచ్చరించారు.
టర్మ్ పాలసీ..
ఇంట్లో డిపెండెంట్ ఉన్నప్పుడు వారి కోసం తగిన కవరేజీతో టర్మ్ డిపాడి పాలసీ తీసుకోవాలని కామత్ సూచించారు. ఇది ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అతని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని అన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా లోన్స్ తీసుకోవటాన్ని పూర్తిగా మానేయాలని, అవి లేటు వయస్సులో భారం మోపుతాయని అంటున్నారు.
0 Comments:
Post a Comment