YouTuber Mark Fischbach: ఇటీవల కాలంలో యూట్యూబ్ సంపాదన పెరుగుతోంది. యూట్యూబ్ ను నమ్ముకున్న వారికి లాభాలే కాని నష్టాలు రావడం లేదు. పైగా పెట్టుబడి లేని సంపాదన.
దీంతో అందరు యూట్యూబ్ నే నమ్ముకుంటున్నారు. మన దేశంలోనే ఒక ఊరిలో దాదాపు కొన్ని వందల మంది యూట్యూబ్ ను నమ్ముకుని సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పని చేసి పదిమందిని సాకితే ఇగురంతోని ఇరవై మందిని సాకాడని సామెత. ఏదైనా మేధస్సుతో చేసే పనికి విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూనే కొంత మంది తమ ఉపాధి కల్పించుకుంటున్నారు. దానికి అంతులేదు. ఎంతైనా సంపాదించుకోవచ్చు. మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
YouTuber Mark Fischbach
కొన్ని కోట్ల మంది యూట్యూబ్ ను నమ్ముకుని జీవిస్తున్నారు. అందులో కీలక వీడియోలు పోస్టు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ యూ ట్యూబర్ సంపాదన ఏడాదికి రూ.312 కోట్లంటే ఆశ్చర్యం వేయక మానదు. అంతలా డబ్బు సంపాదిస్తున్న అతడు చేసే పని ఏంటంటే వీడియోలు అప్ లోడ్ చేయడమే.
దీని ద్వారా అతడు అక్కడి రూ. 38 మిలియన డాలర్లు అంటే మన దేశంలో రూ.312 కోట్లు సంపాదించడం విశేషం. దీంతో అతడి సంపాదనకు అందరు ఆశ్చర్య చకితులవుతున్నారు.
స్మార్ట్ ఫోన్ల కాలం వచ్చాక అందరిలో తెలివితేటలు పెరిగిపోయాయి. ఆన్ లైన్ లోనే చాలా మంది ఎంతో సంపాదిస్తున్నారు. తమ ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు.
అమెరికాలోని యూట్యూబర్ మార్క్ ఫిష్ బాచ్ తన సంపాదన వెల్లడించడంతో అందరు షాక్ కు గురయ్యారు. యూట్యూబ్ ద్వారా అంత మొత్తం ఎలా సంపాదిస్తున్నాడనే ప్రశ్న అందరిలో వస్తోంది. కానీ అది అతడికి సాధ్యమవుతోంది.
1989 జూన్ 28న మార్క్ ఫిష్ అమెరికాలోని హువాయి ద్వీపంలో జన్మించారు, మార్కిప్లియర్ అని ఇతడిని పిలుస్తారు. అతను ఒక అమెరికన్ యూట్యూబర్. వాస్తవానికి హోనోలులు, హవాయి ఇతడి స్వగ్రామం.
కానీ అక్కడినుంచి సిన్సినాటి, ఒహియోలో తన వృత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జీవిస్తున్నాడు. అతని ప్రధాన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు, అతను తోటి యూట్యూబర్ జాక్‌సెప్టిసీ తో కలసి బట్టల కంపెనీ 'క్లోక్'కు సహ-వ్యవస్థాపకుడు పనిచేస్తున్నాడు. పలు పాడ్‌కాస్ట్ సహ-హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. యూనస్ అనస్ ఛానెల్‌కు సహ-హోస్ట్‌గా కూడా చేస్తున్నాడు.
YouTuber Mark Fischbach
సెప్టెంబర్ 2022 నాటికి మార్క్ ఫిష్ యూట్యూబ్ ఛానెల్ 18.91 బిలియన్లకు పైగా వీడియో వీక్షణలను .. 33.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఫిష్‌బాచ్ లెట్స్ ప్లే వీడియోలతో ఇంతటి ప్రఖ్యాతిగాంచాడు.
ఫిష్‌బాచ్ ప్రధానంగా ఇండీ , హర్రర్ గేమ్‌లకు ప్రసిద్ధి చెందాడు, ఇందులో ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీ సిరీస్, ఆమ్నీసియా: ది డార్క్ డీసెంట్ ,దాని సీక్వెల్, గ్యారీస్ మోడ్, హ్యాపీ వీల్స్, సర్జన్ సిమ్యులేటర్, ఎస్.సీపీ-కంటైన్‌మెంట్ బ్రీచ్ ,స్లెండర్: ది ఎయిట్ పేజెస్ లాంటి హర్రర్ గేమ్ లు యూట్యూబ్ లో ఫుల్ ఫేమస్ అయ్యి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అవే ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
ఇతడి సర్వైవల్ హారర్ వీడియో గేమ్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. హర్రర్ వీడియో గేమ్ ల వీడియోలు తయారు చేసి య్యూటూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇవే అతడికి కాసులు కురిపిస్తు్నాయి.
యూ ట్యూబ్ అందరికి ఉపాధి కల్పిస్తోంది. తెలివి ఒక్కరి సొత్తు కాదమ్మా తోటకూర సుబ్బమ్మా అన్నట్లు మన మెదడుకు మేత పెడితే సంపాదన పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు.
దానికి చేయవలసిందల్లా కొన్ని ప్రత్యేకతలు కలిగిన వీడియోలు పోస్టు చేస్తే వాటి వ్యూస్ ను బట్టి వారు మనకు పారితోషికం అందజేస్తారు.
అలా మన ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. మనకు వచ్చే వ్యూస్ ద్వారా మన సంపాదన రెట్టింపు కావచ్చు. దీనికి మన బుద్ధికి పని చెప్పడమే.
0 Comments:
Post a Comment