Warm Up Before Workout: శరీరం ఆరోగ్యంగా ఫీట్ గా ఉంచుకోవడానికి ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఇదే క్రమంలో వార్మ్ అప్ చేయడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గే క్రమంలో వ్యాయామాలతో ఈ వార్మ్ అప్ సులభంగా ఫలితం పొందవచ్చు. జిమ్ లో వర్కౌట్ చేసే క్రమంలో తప్పకుండా నియమాల్లో భాగంగా వార్మ్ అప్ చేయాల్సి ఉంటుంది.
ఇలా చేస్తేనే మీరు శరీరాన్ని అనుకున్న ఆకృతిలో పొందుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా వ్యాయామాల ద్వారా మంచి ఫలితాలు పొందాలనుకుంటే వార్మ్అప్ తప్పకుండా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు.
వ్యాయామానికి ముందు వార్మ్ అప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
గాయాల ప్రమాదం తగ్గుతుంది:
వార్మ్ అప్ చేయడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. అంతేకాకుండా భారీ వ్యాయామాలు చేసే క్రమంలో గాయాలు కాకుండా సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి జిమ్ కి వెళ్లే క్రమంలో తప్పకుండా వార్మ్ అప్స్ చేయాల్సి ఉంటుంది.
వార్మ్ అప్స్ తప్పనిసరి:
జిమ్ కి వెళ్లేవారు తప్పనిసరిగా వార్మ్ అప్ చేసిన తర్వాతే వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్లే వ్యాయామం చేయడం వల్ల మంచి శరీర ఆకృతిని పొందుతారు.
ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది:
భారీ వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా కండరాలను కదిలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీర నొప్పులు పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి వార్మ్ అప్ చేసిన తర్వాత వెళ్తే శరీరం ఫ్లెక్సిబిలిటీ గా మారుతుంది.
క్రాస్ పుష్ అప్స్:
వార్మ్ అప్ చేసిన తర్వాత తప్పకుండా ఐదుసార్లు దీనిని చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. లేకపోతే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా వేస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment