ఇంటర్నెట్ డెస్క్:కొన్నేళ్ల వరకు భూమిపై సూర్యుడు కనబడకుండా పోతే.. సుమారు 500 కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. భూమిపై బతికున్న జనానికి తిండి కూడా దొరకడం కష్టంగా మారితే..
ఈ మాటలు వింటుంటేనే వెన్నులో వణువుకు పుడుతుంది కదూ. కానీ ఇవే వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. దీనికి కారణం కేవలం రెండు దేశాలు.
అవును.. రెండంటే రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావారణం భూమిపై మానవ మనుగడకు సవాలు విసురుతోంది. ఇవి గాలిమాటలు కాదు. నిపుణులు చేస్తున్న హెచ్చరిక.
ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia).. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ దేశాల(Ukraine-Russia crisis) మధ్య ఘర్షణ వాతావరణం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రగిలిపోతున్న రష్యా.. ఆ దేశంపై అణుదాడి(nuclear weapons) చేసేందుకు సిద్ధం అవుతోంది. అణు విన్యాసాలు కూడా ప్రారంభించేసింది. దీంతో నాటో కూటమిలోని యూరప్ దేశాలు అభద్రతాభావానికి లోనవుతున్నాయి.
రష్యా నుంచి ముప్పు పొంచి ఉందనే నిర్ణయానికి వచ్చేశాయి. అందుకే.. యుద్ధానికి సై అంటూ ఆ దేశాలు కూడా కాలు దువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాటో దళాలు అణు విన్యాసాలను కూడా ప్రారంభించేశాయి.
ఈ పరిస్థితులే ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రముఖ విపత్తు నిర్వాహణ నిపుణుడు పాల్ ఇన్‌గ్రామ్( Paul Ingram) తాజాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12వేల అణు ఆయుధాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఒక్క రష్యా మాత్రమే 6వేల అణు ఆయుధాలను కలిగి ఉన్నట్టు చెప్పారు. వీటితో దాడలు జరిగితే.... పేలుడు, రేడియేషన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల మంది వరకు చనిపోవచ్చని అంచనా వేశారు.
పేలుడు సంభవించడం ద్వారా చెలరేగే దుమ్ము, దూళీ, పొగ భూమిని కమ్మేస్తుందన్నారు. ఫలితంగా కొన్నేళ్లపాటు భూమిపై సూర్యడు స్పష్టంగా కనబడకపోవచ్చని వెల్లడించాడు.
ఇలా జరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఊష్ణోగ్రతలు 16 సెంటీగ్రేడ్‌లకు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే.. ఉక్రెయిన్ వంటి చాలా ప్రపంచ దేశాలు పూర్తిగా గడ్డకట్టుకునిపోయే ప్రమాదం ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ను బ్రెడ్ బకెట్ ఆఫ్ యూరప్ అంటారు. యూరప్ దేశాలకు అవసరమైన స్థాయిలో గోదుమల ఉత్పత్తి ఉక్రెయిన్ నుంచే జరుగుతుంది.
ఈ దేశంపై రష్యా గనక అణుదాడి చేస్తే.. యూరప్ దేశాలు సహా ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఆహార కొరత ఏర్పడుతుందని వెల్లడించారు.
ఈ పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మరణాల సంఖ్య 5 బిలియన్ల(సుమారు 500కోట్లు)కు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా తన వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల(ballistic missiles)ను ఉపయోగించి అణుదాడులు చేస్తే నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వేళ అణు బాంబు గనక బ్రిటన్‌లో పడితే మిలియన్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెబుతున్నారు. అదే బాంబు చైనా, భారత్ వంటి పెద్ద భూభాగాలు కలిగిన దేశాల్లో పడితే.. నష్ట తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నాటికి 12,700 అణు ఆయుధాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో అత్యధిక అణు ఆయుధాలు రష్యా వద్దే ఉన్నాయి.
రష్యా సుమారు 6000వేల అణు ఆయుధాలను కలిగి ఉంటే.. అమెరికా 5400 ఆయుధాలు కలిగి ఉంది. బ్రిటన్ వద్ద 225 అణు ఆయుధాలు ఉన్నాయి.
ఫ్రాన్స్, ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా దేశాలు కూడా అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం.. 2027 నాటికి చైనా 700 అణు ఆయుధాలను సమకూర్చుకుంటుదట.
0 Comments:
Post a Comment