భారత క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli)..
సూపర్ ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియాను గెలిపించి, కింగ్ ఈజ్ బ్యాక్ (King is Back) అనిపించాడు. సూపర్-12లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచి, టోర్నీలో బోణీ కొట్టింది.
లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ గురించి క్రికెట్ అభిమానులకు తెలియని 7 ఆసక్తికర విషయాలు చూద్దాం.
* తక్కువ ఇన్నింగ్స్‌లలో పదివేల రన్స్ : ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వన్డే (ODI) ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో 10,000 రన్స్ చేసి లెజెండ్‌గా నిలిచారు. అయితే సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. సచిన్ 259 ఇన్నింగ్స్‌లో అన్ని రన్స్ చేస్తే, విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10,000 రన్స్ మైలు రాయి దాటాడు. ఫామ్‌ను కొనసాగిస్తే.. వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
* ద్వైపాక్షిక ODI సిరీస్‌లో రికార్డు : 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో 500 రన్స్ చేశాడు కోహ్లీ. ఇది ఒక రికార్డు. ఆ సిరీస్‌ను 5-1తో కైవసం చేసుకోవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
* టెస్టు కెప్టెన్‌గా సంచలన విజయాలు : 2015లో విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లు గెలిచిన ఏసియన్ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2019లో తొలిసారి ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. 2018లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచింది.
* ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ : మైదానంలో పరుగుల వరద పారించే ఆటగాడిగా కోహ్లీకి పేరుంది. 2013లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఇండియా తరఫున తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
* వన్డే వరల్డ్‌కప్ ఎంట్రీ మ్యాచ్‌లోనే సెంచరీ : కోహ్లీ 2011లో ఫస్ట్ వరల్డ్ కప్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, టోర్నీ ఎంట్రీలోనే సెంచరీతో అదరగొట్టాడు. ఇది కూడా ఒక రికార్డు. మ్యాచ్‌లో 83 బంతుల్లో 100 రన్స్ చేసి 2011 ప్రపంచ కప్ గెలుపునకు అడుగులు పడేలా చేశాడు కోహ్లీ.
* రెండుసార్లు వికెట్ కీపింగ్ : కోహ్లీ ఇప్పటి వరకు కెరీర్‌లో రెండుసార్లు వికెట్ కీపింగ్ చేశాడు. జోహ్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒకసారి ధోనీ బౌలింగ్ చేస్తుండగా విరాట్ కీపింగ్ చేశాడు. ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓసారి కీపింగ్ చేశాడు.
* ఐపీఎల్ వేలంలోకి రాని ఏకైక క్రికెటర్ : ఐపీఎల్ చరిత్రలో వేలంపాటలోకి రాని స్టార్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున మాత్రమే ఆడుతున్నాడు.
0 Comments:
Post a Comment