అలాగే.. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ స్కెచ్‌లు వేసి తమలోని కళను ప్రదర్శిస్తుంటారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం ఈ రెండు పనులను ఒకేసారి చేసేశాడు. అయితే.. మనోడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది ఇంట్లో కాదు.
దీంతో.. ఆ చిన్నోడు చేసిన పని చూసి తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఓ చిన్నోడు తన తల్లిదండ్రులకు షాకిచ్చాడు. తల్లి మేకప్‌కిట్ నుంచి పదుల సంఖ్యలో పట్టుకొచ్చేశాడు.
తర్వాత ఆ లిప్‌స్టిక్‌లు పూర్తిగా అరిగిపోయే వరకూ.. ఇంటి బయట ఉన్న తండ్రి కారుపై ఇష్టమొచ్చినట్టు గీసేసి తనలో ఉన్న కళను ప్రదర్శించాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడవాళ్లు రికార్డు చేయగా.. ప్రస్తుతం అది నెట్టింటికి చేరింది.
దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. బుడ్డోడి పనికి నవ్వుకుంటున్నారు. అయితే.. తల్లిదండ్రులు మాత్రం కొడుకు చేసిన పని చూసి తలలు పట్టుకున్నారు.
0 Comments:
Post a Comment