Tollywood Stars Staying Rental Houses: సినిమా నటుల సంపాదన కోట్లలో ఉంటుంది. దీంతో వారు హై లెవల్లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్టార్ గా మారిన తరువాత మొట్టమొదటగా ఓ ఇల్లును కొనుక్కుంటారు.
వారికి అనుగుణంగా ఆ ఇంటిని మార్చుకొని అందులో హ్యాపీగా ఉంటారు. మన టాలీవుడ్ లోని కొందరు నటులు, టెక్నీషియన్లకు కూడా ఇంద్రభవనం లాంటి ఇళ్లు ఉన్నాయి. కానీ వారు అందులో ఉండడం లేదు.
బయట వేరే ఇల్లును అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అదేం కర్మ..! సొంత ఇల్లు ఉండగా.. ఇదేం పని..? అని అనుకోవచ్చు. కారణం తెలియదు. కానీ ఎవరు ఇలా అద్దెకు ఉంటున్నారో తెలుసుకుందాం.
మహేశ్ బాబు:
Mahesh Babu
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఇప్పటి వరకు నటించింది కొన్ని సినిమాలే. కానీ ఆయన సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే పెరిగింది. సినిమాలతో పాటు పలు యాడ్స్ లో ఎక్కువగా నటించేది మహేశ్ మాత్రమే.
దీంతో ఆయన సంపాదన కోట్లలోనే ఉంటుందని అనుకోవచ్చు. కొన్ని సంవత్సరాల కిందట ఓ సినిమా హాల్ ను కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు ఆయన ఇల్లు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మహేశ్ బాబుకు జూబ్లిహిల్స్లో అతిపెద్ద భవనం ఉంది.
కానీ ఆయన అందులో ఉండడం లేదు. ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూం ప్లాట్ ను అద్దెకు తీసుకొని రెంట్ కు ఉంటున్నారు. ఆయన సోదరి ఇంటి ఎదురుగానే ఇల్లు తీసుకొని ఉంటున్నాడు.
దానికి కారణం తన తల్లిని చూసుకునేందుకేనట.. తల్లి వృద్ధాప్యంలో మొన్నటివరకూ సీరియస్ గా ఆరోగ్యం ఉండేది. సోదరి ఇంట్లో ఉంటున్న తల్లికి దగ్గరగా ఉండేందుకే మహేష్ ఇంద్రభవనం వదిలి సోదరి ఇంటి ముందుకు వచ్చాడట.. ఇప్పుడు తల్లి చనిపోవడంతో ఆ ఇంట్లోనే ఉంటాడా? మారుతాడా? అన్నది వేచిచూడాలి.
-రాజమౌళి:
SS Rajamouli
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి రేంజ్ ఎంటో అదరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇటీవల ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేసేందుకు జపాన్ వెళ్లారు. ఆయన తీసిన ప్రతీ సినిమా హిట్టు. దీంతో ఆయన సంపాదన ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటారని ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలో ఆయన కరోనా సమయంలో ఇంద్రభవనం లాంటి తన ఇల్లును చూపించారు. ఇంటి ముందు గార్డెన్ తదితర సౌకర్యాలతో రిచ్ గా జీవించారు.
కానీ రాజమౌళి కుటుంబం ప్రస్తుతం అందులో ఉండడం లేదు. మణికొండలో ఓ త్రిబుల్ బెడ్ రూం ప్లాట్ లో అద్దెకు ఉంటున్నారు. తన అన్నయ్య కీరవాణి ఇతర సోదరులతో కలిసి ఉండే అపార్ట్ మెంట్ లోనే రాజమౌలి ఉంటున్నాడట..
-జగపతిబాబు:
Jagapathi Babu
ఒకప్పటి స్టార్ నటుడు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న జగపతిబాబు సంపాదన కోట్లలోనే ఉంటుంది. మధ్యలో కొన్ని రోజుల పాటు ఆర్థికంగా దెబ్బతిన్నా.. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నారు.
ఇప్పుడు ఆయన తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ నటుడే. జగపతిబాబుకు అపోలో ఆసుపత్రి దగ్గరలో పెద్ద భవనం ఉంది. కానీ అందులో ఆయన ఉండడం లేదు. కూకట్ పల్లిలోని ఓ ప్లాట్ లో అద్దెకు ఉంటున్నాడు.
నాగచైతన్య:
Naga Chaitanya
అక్కినేని ఫ్యామిలీకి తిన్నా తరగని ఆస్తులున్నట్లు టాక్. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య పేరు మీద కూడా కొన్ని ఆస్తులున్నాయని సమాచారం. కానీ ఆయన అబిడ్స్ లోని ఓ పెద్ద మాల్ వద్ద ఉన్న సాధారణ ప్లాట్ లో ఉంటున్నాడు.
అయితే ఈ ఇంటిని తన తల్లి దగ్గుబాటి లక్ష్మి ఇంటీరియడ్ డిజైన్ చేశారట. అందుకే ఈ ప్లాట్ ను ఎంచుకున్నాడట. అంతేకాకుండా సమంతతో వివాహం అయిన తరువాత కూడా చైతూ ఇందులోనే గడిపాడట.
0 Comments:
Post a Comment