విరూపాక్ష దేవాలయం కర్ణాటకలోని హంపిలో ఉంది. ఇది దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం బళ్లారి జిల్లాలో బెంగుళూరుకు 353 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హంపి ప్రాంతం... రామాయణ కాలం నాటి కిష్కింధ అని భావిస్తారు. ఆలయంలో శివుని విరూపాక్ష రూపాన్ని పూజిస్తారు. ఈ శివాలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మితమయ్యింది.
ఈ పురాతన దేవాలయానికి శివ భక్తుడైన రావణునికి అనుబంధం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణం వైపు ఒంగి ఉంటుంది. పరమశివుడు రావణుడికి దివ్యమైన శివలింగాన్ని ఇచ్చాడట.
అయితే ఆ శివలింగాన్ని ఎక్కడ కిందకు దించితే అక్కడే దానిని ప్రతిష్ఠించాలని శివుడు షరతు విధించాడట.
శివుడు ఇచ్చిన ఈ శివలింగం తీసుకుని రావణుడు లంకకు వెళుతున్నప్పుడు, దారిలో ఈ శివలింగాన్ని కొద్దిసేపు పట్టుకోవాలని ఒక వృద్ధుడికి అప్పగించాడు. అతను ఆ శివలింగాన్ని అక్కడే నేలపై ఉంచాడు.
తరువాత రావణుడు దానిని కదిలించలేకపోయాడట. దీంతో అక్కడే శివుని ఆలయాన్ని నిర్మించాడట.
ఈ ఆలయంలో కొలువైన శివుణ్ణి విరూపాక్షుడు అని అంటారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది.
0 Comments:
Post a Comment