Teacher Eligibility Test(TET): టెట్ అర్హత సాధించని వారికి మరో అవకాశం.. రేపటి నుంచి దరఖాస్తులు..
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కూడా సీటెట్ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 31న ప్రారంభించబోతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 24. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
CTET పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించబడుతుంది. బోర్డు ప్రతి సంవత్సరం CTET ను రెండుసార్లు నిర్వహిస్తుంది. CTETలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-I .. 1 నుండి 5వ తరగతి వరకు ఉపాధ్యాయుడు కావాలనుకునే అభ్యర్థి కోసం ఉంటుంది. అదేవిధంగా.. 6 నుండి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థికి పేపర్-II ఉంటుంది. కాగా, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో పాస్ కావాలంటే కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ - ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.1,200
SC/ST/PWDB- ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ. 600
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - నవంబర్ 24
ఫీజు సమర్పణకు చివరి తేదీ - నవంబర్ 25
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
Step 2: అక్కడ 'Apply Online' పై క్లిక్ చేయండి
Step 3: రిజిస్టర్ నంబర్ జనరేట్ అవుతుంది. అది సేవ్ చేసుకోవాలి.
Step 4: ఆన్‌లైన్ దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
Step 5: అనంతరం ఫీజు చెల్లించాలి.
అవసరమైన డాక్యుమెంట్స్
- పదోతరగతి సర్టిఫికెట్ (10th Certificate)
- ఇంటర్ లేదా 12వ తరగతి సర్టిఫికెట్
- ఉన్నత విద్యకు సంబంధించిన ధ్రువపత్రాలు
- పాస్‌పోర్టు సైజ్‌ఫోటో (Passport Photo)
- సిగ్నేచర్ స్కాన్ కాపీ
పరీక్ష విధానం
పేపర్ Iలో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ I అండ్ II, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి 30 చొప్పున MCQ ప్రశ్నలు ఉంటాయి. ఇక, పేపర్ IIలో... చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ I అండ్ II నుంచి 30 చొప్పున MCQ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సైన్సెస్ నుంచి 60 చొప్పున MCQ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌లో ఐదు విభాగాలతో కలిపి మొత్తం 150 MCQ ప్రశ్నలు ఉంటాయి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో..
ప్రైమరీ, ఎలిమెంటరీ లెవల్స్‌లో బోధన కోసం టీచర్లను ఎంపిక చేయడానికి సీ-టెట్ నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతుంది. పరీక్ష తేదీ డిసెంబర్ లేదా జనవరి ఉండనుంది. ప్రతి పేపర్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షను 20 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ప్రైమరీ లెవల్‌లో 1 నుంచి 5 తరగతులకు సంబంధించినది కాగా, పేపర్-2 ఎలిమెంటరీ లెవల్‌లో 6 నుంచి 7 తరగతుల్లో బోధన కోసం నిర్వహిస్తారు.
0 Comments:
Post a Comment