Success Story: రూ.2 లక్షలతో ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్ బిజినెస్.. రూ.75 కోట్లకు చేరిన టర్నోవర్.. ఏం బిజినెస్ అంటే?
చాలా మంది ఉద్యోగం కాకుండా సొంతంగా వ్యాపారం (Business) చేయాలనుకుంటారు.
కానీ సరైన మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు ధైర్యం లేకపోవడంతో వారు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిలో స్ఫూర్తిని నింపేందుకు ముగ్గురు మిత్రులకు సంబంధించిన కంపెనీ విజయగాథను తీసుకొచ్చాం. ముగ్గురు కాలేజీ స్నేహితులు తమ చదువు పూర్తయిన తర్వాత సొంతంగా వ్యాపారం (Own Business) చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారం ప్రారంభించిన సమయంలో ఈ యువకుల దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఎలాగోలా డబ్బు కూడబెట్టి 2 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు. కానీ తమ కృషి, అంకితభావంతో ఈరోజు వ్యాపారాన్ని విజయపథంలోకి తీసుకెళ్లారు. వారి సక్సెస్ స్టోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలోని (New Delhi) నేతాజీ సుభాష్ యూనివర్శిటీలో చదువుతున్న ముగ్గురు స్నేహితులైన హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్ మరియు సుమన్ కలిసి ఆన్‌లైన్ బేకరీని ప్రారంభించారు. ఈరోజు వారి వ్యాపారం టర్నోవర్ 75 కోట్ల రూపాయలకు చేరుకుంది.
ఎలా మొదలైంది?
హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్ మరియు సుమన్ పాత్రా కాలేజీ రోజుల నుండి మంచి స్నేహితులు. 2010లో ఈ ముగ్గురు కలిసి వ్యాపారం ప్రారంభించారు. ఈ ముగ్గురు రూ. 2 లక్షల పెట్టుబడితో గురుగ్రామ్‌లోని నేలమాళిగలో తొలి వెంచర్ ను ప్రారంభించారు. అప్పట్లో ఈ కంపెనీలో ఒకే ఒక్క ఉద్యోగి ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తి కస్టమర్ సేవతో పాటు అన్ని కార్యకలాపాలు మరియు డెలివరీకి బాధ్యత నిర్వహించేవారు. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో పువ్వులు, కేక్ మరియు బహుమతిలను అందిస్తోంది.
ప్రేమికుల రోజున గుర్తింపు:
2010లో ప్రేమికుల రోజున తన పనికి కొత్త గుర్తింపు వచ్చిందని ఆ యువకులు చెప్పారు. నిదీని తర్వాత వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం వారు భావించాడు. అలా 2016 సంవత్సరంలో, హిమాన్షు, శ్రేయ మరియు సుమన్ పాత్ర తమ కొత్త కంపెనీ క్రింద బేకింగో (Bakingo) అనే ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించారు.
ప్రణాళిక:
బేకింగో దేశంలోని అనేక నగరాల్లో తాజా కేక్ డెలివరీని ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ 11 రాష్ట్రాల్లో తన సేవలను అందిస్తోంది. దేశంలోని మెట్రో నగరాలు, హైదరాబాద్ , బెంగళూరు మరియు ఢిల్లీతో పాటు, మీరట్, పానిపట్, రోహ్‌తక్, కర్నాల్ వంటి చిన్న నగరాల్లో ఇప్పుడు ఈ సేవను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.
500 మందికి ఉపాధి:
ముగ్గురు మిత్రులతో ప్రారంభమైన ఈ సంస్థ ఐదు వందల మందికి పైగా ఉపాధిని కల్పించింది. Bakingo యొక్క 30 శాతం ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయి. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ డెలివరీ పోర్టల్స్‌లో 70 శాతం ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. కంపెనీ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బేకింగ్ టర్నోవర్ రూ.75 కోట్లకు చేరుకోవడం విశేషం.
0 Comments:
Post a Comment