Search This Blog

Monday, 17 October 2022

Spl Story: తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్లకొద్ది నోట్ల కట్టలు.. సీజ్​ చేసిన డబ్బంతా ఏం చేస్తారంటే?


ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 3 నెలలుగా పలు కేసులకు సంబంధించి దాడులు, సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ మధ్య మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌కు సంబంధించిన మోసం కేసులో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంట్లో రూ.17 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంది.

 ఇక.. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పోలీసుల చెకింగ్​లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.

బెంగాల్​లో దొరికిన డబ్బును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించేందుకు కరెన్సీ లెక్కింపు యంత్రంతో పాటు దాదాపు 8మంది బ్యాంకు అధికారులను పిలిపించారు. 

పశ్చిమ బెంగాల్ SSC స్కామ్‌కు సంబంధించి సస్పెండ్ చేసిన మంత్రి పార్థ చటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ అపార్ట్ మెంట్‌ల నుండి 50 కోట్ల కంటే ఎక్కువే స్వాధీనం చేసుకుంది.

పార్థ చటర్జీ గ్రూప్ C & D సిబ్బంది, IX-XII తరగతుల అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రికవరీ చేసిన ఈ మొత్తం టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ నుండి వచ్చిన డబ్బేనని అనుమానిస్తున్నారు. 

దాదాపు 24 గంటల పాటు సాగిన కౌంటింగ్‌లో పట్టుబడిన నగదును లెక్కించి బ్యాంకు అధికారులు సైతం విసిగిపోయారు. దీనికి ముందు జార్ఖండ్ మైనింగ్ స్కాంలో రూ.20 కోట్లకుపైగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

పైన పేర్కొన్న సీజ్‌కి అదనంగా, ఏజెన్సీ వివిధ దాడులు, పరిశోధనలలో కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది.

ఆర్థిక దర్యాప్తు సంస్థ డబ్బును స్వాధీనం చేసుకునే అనుమతి ఉంటుంది. అయితే, వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకునే అవకాశం లేదు.

 ప్రోటోకాల్ ప్రకారం ఏజెన్సీ నగదును రికవరీ చేసినప్పుడల్లా నిందితుడికి నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే వివరాలు తెలియజేయడానికి అవకాశం ఇస్తుంది. 

అనుమానితుడు ఈడీ అధికారులను కానీ, సీబీఐని కానీ సరైన వివరాలు, కచ్చితమైన సమాధానాలు, ఆధారాలు చూపకపోతే ఆ డబ్బుని లెక్కల్లోకి రాని నగదుగా.. అక్రమంగా సంపాదించిన డబ్బుగా పరిగణిస్తారు.

ఇట్లా స్వాధీనం చేసుకున్న నగుదును ఓ మెమోలో 2000, 500, 100 వంటి డినామినేషన్లలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలు తెలియపరుస్తారు. తర్వాత స్వతంత్ర సాక్షుల సమక్షంలో వాటిని బాక్సుల్లో పెట్టి సీలు వేస్తారు. 

డబ్బు సీలు చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన డబ్బుకు సంబంధించిన మెమోను, రికవరీ చేసిన నగదును ఆ రాష్ట్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు పంపిస్తారు.

 అక్కడ అది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్​కి చెందిన వ్యక్తిగత డిపాజిట్ (PD) ఖాతాలో జమ అవుతుంది. దీని ప్రకారం నగదు కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నట్టు లెక్క.

అయితే, స్వాధీనం చేసుకున్న డబ్బును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బ్యాంకు లేదా ప్రభుత్వం ఏవీ ఉపయోగించడానికి అవకాశం లేదు. ఏజెన్సీ సీజ్​ చేసిన నగదుకు సంబంధించిన తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను సిద్ధం చేస్తుంది. 

ఆరు నెలల్లో ఈ అటాచ్‌మెంట్‌ను నిర్ధారించడానికి న్యాయనిర్ణేత అధికారం అవసరం. ఈ కసరత్తు యొక్క ఉద్దేశం ఏమిటంటే.. నిందితులు స్వాధీనం చేసుకున్న నగదును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతారు.

 అటాచ్‌మెంట్ నిర్ధారించబడిన తర్వాత కేసులో విచారణ ముగిసే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంచుతారు. 

నిందితుడు దోషిగా తేలితే ఆ నగదు మొత్తం కేంద్రానికి చెందిన ఆస్తి అవుతుంది. నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే బ్యాంకులో సేఫ్​గా ఉన్న ఆ నగదు తిరిగి అందజేస్తుంది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top