సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడే సమయంలో ఎక్కువగా కనిపించే దృశ్యాలు..
ఆలయాలు మూసి వేయడం, గ్రహణం విడిచిన తర్వాత శుభ్రం చేయడం, తలస్నానం చేయడం వంటివి చేస్తారు. ఇక వీటితో పాటు.. గ్రహణ సమయంలో ఇంట్లోని ప్రతి వస్తువు, పదార్థాల మీద గరికను వేయడం చూస్తాంటాం.
మరి ఇలా గరికను ఎందుకు వేస్తారు.. దీని వెనక ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా వంటి పూర్తి వివరాలు.. మన పురణాల్లో గరికకు చాలా ప్రాధాన్యత ఉంది.
అసలు గరిక పుట్టుక గురించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. క్షీర సాగర మధనం కోసం శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించిన సంగతి తెలిసిందే. ఇక సాగర మధనం జరుగుతున్న సమయంలో.. విష్ణువు రోమాలు రాలి భూమికి చేరాయని.. అవే గరికగా మారాయని.. ఆ తరువాత గరుత్మంతుడు వాటిపై అమృత బాండాన్ని ఉంచిన్నపుడు.. కొన్ని అమృత బిందువులు గరిక పోచల మీద పడటం వల్ల వాటికి అంత శక్తి పవిత్రత వచ్చిందని నమ్ముతారు.
ఇక శాస్త్ర ప్రకారం చూసుకుంటే.. గరిక మీద 1982-83 ప్రాంతంలో భారతదేశంలో సూర్య గ్రహణం రోజున ఓ పరిశోధన జరిగింది. వారు గమనించింది ఏంటంటే.. గడ్డి జాతికి చెందిన గరిక నిటారుగా పైకి నిలబడి.. సూర్య కిరణాల ద్వారా వెలువడిన సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది.
అలానే అతినీలలోహిత కిరణాలను, గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రసారం అయ్యే హానికరమైన కిరణాలను కూడా గ్రహిస్తుందని గ్రహించారు.
సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో.. నీరు, ఆహార పదార్థాలు వంటి వాటి మీద వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే ఇలా చేయడం వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే.. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది.
కనుక ఇంట్లోని అన్ని వస్తువులు, ఆహార పదార్థాల మీద గరిక పోచలను ఉంచడం వల్ల.. వాటిలోని యాంటీ రేడియేషన్ స్వభావం కారణంగా.. గ్రహణ సమయంలో వెలువడే కిరణాల రేడియేషన్ ప్రభావం నుంచి ఆయా పదార్థాలను కాపాడుకోవచ్చు. గ్రహణం తర్వాత వాడుకోవచ్చు అంటున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
0 Comments:
Post a Comment