Post Office Schemes: రిస్క్ లేకుండా రూ.4 లక్షలు పొందండిలా.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరే లాభం!
NSC Interest Rate | డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా?
అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఒకరకమైన స్కీమ్స్, రిస్క్ తీసుకునే వారికి పోస్టాఫీస్, బ్యాంకుల్లో పలు స్కీమ్స్ లభిస్తున్నాయి.
మీరు ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ టెన్యూర్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తే.. పోస్టాఫీస్ అందిస్తున్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని వల్ల మంచి రాబడి పొందొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలంల ఐదేళ్లు. ప్రస్తుతం మీరు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఈ స్కీమ్‌లో ఎక్కువ రాబడి పొందొచ్చు. ఇందులో చేరడం వల్ల స్థిరమైన రాబడి లభిస్తుంది.
మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి మీరు ఈ పథకంలో చేరొచ్చు. మీకు ఈ పథకంలో చేరితే 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో వడ్డీ మొత్తం, అసలు రెండూ కలిపి చెల్లిస్తారు. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కోరుకునే వారికి ఇది అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఎన్ఎస్‌సీ క్యాలిక్యులేటర్ ప్రకారం.. మీరు ఐదేళ్ల టెన్యూర్‌తో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 6.8 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 14 లక్షలు లభిస్తాయి. అంటే ఐదేళ్లలోనే రూ. 4 లక్షల లాభం వస్తుందని చెప్పుకోవచ్చు.
అలాగే మీరు రూ.10 లక్షలు కాకుండా రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత మీకు దాదాపు రూ. 7 లక్షల దాకా వస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ. 2 లక్షల వరకు పొందొచ్చు. ఇలా మీరు డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. కనీసం రూ.1000 మొత్తంతో ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
అలాగే ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టే వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అందువల్ల డబ్బులు పెట్టిన తర్వాత ఐదేళ్లు అయిపోయిన తర్వాతనే డబ్బులు విత్‌డ్రా చేసుకోగలం. అందువల్ల మీరు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించొచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఇక నేరుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. భారీ రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. కొన్ని సార్లు పెట్టిన డబ్బులు కూడా రాకపోవచ్చు.
0 Comments:
Post a Comment