Search This Blog

Thursday, 27 October 2022

PM Kisan: రైతులకు అలర్ట్... వారి అకౌంట్‌లోకి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్

 PM Kisan: రైతులకు అలర్ట్... వారి అకౌంట్‌లోకి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM Kisan Scheme) చెందిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేసింది.
న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పీఎం కిసాన్ నిధుల్ని జమ చేశారు. 8 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో రూ.16,000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 24 లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఆలస్యంగా డబ్బులు జమ కావొచ్చు. 
పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా రైతుల అకౌంట్లలో నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 జమ అవుతాయి. ఈసారి కొందరు రైతుల అకౌంట్లలో రూ.4,000 జమ కానున్నాయి. ఈ విషయంపై గతంలోనే స్పష్టత ఇచ్చింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం మే చివరి వారంలో పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతుల అకౌంట్లలో రూ.2,000 జమ కాలేదు. 
పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందని రైతుల్ని గుర్తించి వారి అకౌంట్లలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన రూ.2,000, 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మేలో విడుదల చేసిన వాయిదా, తాజాగా విడుదల చేసిన వాయిదా కలిపి రూ.4,000 వారి అకౌంట్లలో జమ కానున్నాయి. అయితే మేలో డబ్బులు రాని రైతులకు మాత్రమే రూ.4,000 జమ అవుతాయి. మేలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందినవారికి ఇప్పుడు 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 మాత్రమే జమ అవుతాయి. 

ఇక ఈసారి ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ డబ్బుల్ని పొందడానికి ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇకేవైసీ పూర్తి చేయని రైతులకు 12వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. 

మరి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇలా చెక్ చేయండి.

Step 1- రైతులు ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. 

Step 2- Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. 

లేదా నేరుగా https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్ ఓపెన్ చేయొచ్చు. 

Step 3- ఆ తర్వాత ఆధార్ నెంబర్ , పీఎం కిసాన్ అకౌంట్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి. 

Step 4- వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. 

Step 5- వివరాలన్నీ సరిగ్గా చెక్ చేయాలి. 

Step 6- ఒకవేళ మీ అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్టు కనిపించకపోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top