Personal Loan: పర్సనల్ లోన్ కావాలా? 24 బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువంటే?
Personal Loan Interest Rates | పర్సనల్ లోన్ పొందాలని చూస్తున్నారా?
అయితే మీరు ముందుగా చేయాల్సిన పని ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. ఏ బ్యాంక్‌లో అయితే తక్కువ వడ్డీ రేటు ఉందో అక్కడే లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మనం ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.9 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 9.75 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 9.8 శాతం నుంచి ప్రారంభమౌతోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్ పొందాలని భావిస్తే.. వడ్డీ రేటు 10.2 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. ఇండియన్ బ్యాంక్‌లో లోన్‌పై వడ్డీ రేటు 10.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి పడుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఫెడరల్ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే 10.49 శాతం నుంచి వడ్డీ పడుతుంది.
కర్నాటక బ్యాంక్‌లో వడ్డీ రేటు 13.18 శాతంగా ఉంది. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11 శాతంగా ఉంది. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 10.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 10.55 శాతంగానే ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వడ్డీ రేటు 10.7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ఉంది.
ఐడీబీఐ బ్యాంక్‌లో చూస్తే.. లోన్ పొందాలంటే 11 శాతం వడ్డీ పడుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 11.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. యూకో బ్యాంక్‌లో వడ్డీ రేటు 11.95 శాతంగా ఉంది. ఐఓబీలో లోన్ పొందాలంటే 11.9 శాతం వడ్డీ పడుతుంది.
సౌత్ ఇండియా బ్యాంక్‌లో వడ్డీ రేటు 12.5 శాతంగా కొనసాగుతోంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. యాక్సిస్ బ్యాంక్‌లో చూస్తే.. వడ్డీ రేటు 12 శాతం నుంచే స్టార్ట్ అవుతోంది. ఇక కెనరా బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 13.15 శాతంగా ఉంది. కాగా ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.
0 Comments:
Post a Comment