IND vs PAK, Pakistan Fans wants Virat Kohli instead of Kashmir: దాయాదులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ అంశం పెద్ద సమస్యగా ఉన్న విషయం తెలిసిందే.
కాశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య భీకర పోరాటం జరుగుతోంది. దాంతో నిత్యం ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంటుంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ సైన్యాల మధ్య చాలా దాడులు జరిగాయి. 2019లో పుల్వామా దాడి జరగ్గా.. అందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది కూడా. అయితే కాశ్మీర్ కోసం నిత్యం పోరాడే పాకిస్తాన్ ప్రజలు.. ఇప్పుడు మాకొద్దు అంటున్నారు. మీరు చదువుతున్నది నిజమే. అందుకు కారణం ఏంటంటే?
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) అండతో చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు.
31 పరుగులకే కీలక నాలుగు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పాక్ పేసర్లు వరుసగా దాడి చేసినా.. తన అనుభవాన్ని ఉపయోగించి క్రీజులో నిలబడ్డాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచును తన ఆటతో ముందుగా రేసులోకి తెచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ.. ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు.
0 Comments:
Post a Comment