LIC Loan: చౌక వడ్డీకే ఎల్ఐసీ లోన్.. ఇలా పొందండి! రూ.5 లక్షలకు ఎంత ఈఎంఐ కట్టాలంటే?
Personal Loan | చౌక వడ్డీకే రుణం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? ఎల్ఐసీ (LIC) పాలసీ కలిగిన వారు తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు ఉంటుంది.
పాలసీపై లోన్ (Loan) కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఫెసిలిటీ అన్ని పాలసీలకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందువల్ల పాలసీ పొందే సమయంలోనే లోన్ ఫెసిలిటీ ఉంటుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం.
ఎల్ఐసీ పాలసీ కలిగిన వారు పర్సనల్ లోన్‌ను తక్కువ వడ్డీకే పొందొచ్చు. ఎల్ఐసీ అందించే లోన్స్‌పై వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే ఎంత వరకు లోన్ వస్తుందనే విషయం పాలసీ, పాలసీదారుడి ఆదాయం ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. పాలసీ సరెండర్ వ్యాల్యూను పరిగణలోకి తీసుకొని రుణ మొత్తాన్న నిర్ణయిస్తారు.
ఎల్ఐసీ పాలసీని తనఖా పెట్టి లోన్ పొందాలి. తీసుకున్న రుణాన్ని ఐదేళ్ల టెన్యూర్‌లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముందే చెల్లిస్తే.. ఎలాంటి చార్జీలు ఉండవు. అంటే ఫోర్ క్లోజర్ లేదా ప్రిక్లోజింగ్ చార్జీలు ఉండవని అర్థం చేసుకోవాలి. లోన్ అమౌంట్ ప్రాతిపదికన ఈఎంఐ కూడా మారుతుంది. ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లి మీ పాలసీకి లోన్ ఆప్షన్ ఉందా? లేదా? వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అర్హత ఉంటే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఏడాది టెన్యూర్‌తో రూ. లక్ష మొత్తానికి 9 శాతం ప్రాతిపదికన చూస్తే.. ఈఎంఐ రూ. 8745గా ఉంటుంది. అదే రెండేళ్ల కాల పరిమితితో లోన్ తీసుకుంటే అప్పుడు ఈఎంఐ రూ. 4568 అవుతుంది. అలాగే ఐదేళ్ల కాల పరిమితితో లోన్ తీసుకుంటే మాత్రం అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ. 2076 అవుతుంది.
అదే రూ. 5 లక్షల మొత్తాన్ని రుణం కింద తీసుకుంటే.. అప్పుడు ఈఎంఐ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఏడాది టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 44,191 చెల్లించాలి. రెండేళ్ల ఈఎంఐ అయితే రూ. 23,304 పడుతుంది. మూడేళ్లు పెట్టుకుంటే నెలకు రూ. 18,472 చెల్లించాలి. నాలుగేళ్ల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 15 వేలు కట్టాలి. ఐదేళ్లకు అయితే నెలకు రూ. 12,917 ఈఎంఐ పడుతుంది. అందువల్ల ఎల్ఐసీ పాలసీ కలిగిన వారు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పాలసీ ద్వారా రుణం పొందొచ్చు.
0 Comments:
Post a Comment