ఇంటర్నెట్ డెస్క్: కిడ్నీలు సరిగా పని చేయకపోతే చివరికి బయటి నుంచి రక్తాన్ని శుద్ధి చేయడానికి డయాలసిస్ చేయాల్సిందే.
ఇది చాలా తక్కువ మందికి అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం తీవ్రస్థాయిలో ఉండి, కిడ్నీలు పూర్తిస్థాయిలో రక్తాన్ని వడబోయలేని స్థితిలో ఉన్నప్పుడు డయాలసిస్ చేసి రోగికి స్వాంతన చేకూర్చుతారని నెఫ్రాలజిస్టు డాక్టర్ వి. రమేష్ వివరించారు.
కిడ్నీలు ఏం చేస్తాయంటే...
మన కిడ్నీలు రోజుకు 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అవి మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్‌ఫెక్షన్లు, అధికంగా మందులు వాడటంతో పాడయినపుడు యంత్రాల సాయంతో రక్తాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది.
లేకపోతే వ్యర్థాలన్నీ శరీరంలో ఉండిపోయి విషతుల్యం చేస్తాయి. నీటి నిల్వ అధికంగా ఉండిపోతాయి. ఈ సమయంలో వికారం, వాంతులు కావడంతో పాటు ఆకలి మందగిస్తుంది.
ఏం చేస్తారంటే...
కిడ్నీలు పని చేయనప్పుడు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. హెమో డయాలసిస్ యంత్రంతో చేస్తారు. పెరిటోనియల్ డయాలసిస్‌ను శరీరాన్ని ఉపయోగించుకుని చేయనున్నారు. కొంతమందికి హఠాత్తుగా కిడ్నీలు పని చేయనపుడు డయాలసిస్ చేస్తారు.
వీరికి మళ్లీ కిడ్నీలు తిరిగి పనిచేస్తాయి. దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్య ఉన్నవారు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. ఇది వద్దనుకుంటే కిడ్నీ మార్పిడికి వెళ్లక తప్పదు.
జాగ్రత్తలేవీ...!
ఈ జబ్బుతో బాధ పడుతున్న వారు ఆహార నియమాలను పాటించాలి. నీరు తక్కువగా తీసుకోవాలి. అందులోనూ పొటాషియం తక్కువగా ఉండాలి.
ఉప్పు పూర్తిగా తగ్గించాలి. యాపిల్, జామ, బొప్పాయి తినొచ్చు. కూరగాయల పొట్టు తీసి వండుకొని తినాలి. వ్యాయామం తప్పక చేయాలి.
0 Comments:
Post a Comment