Job Mela in AP: ఏపీలో 31న మరో జాబ్ మేళా.. రూ.3.02 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి...
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 31న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా Hetero, Sri Gopal Automotive Ltd, Blue Ocean Biotech తదితర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఎస్సీ, టెన్త్, బీఎస్సీ, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవచ్చు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Hetero:ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఫార్మా విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి రూ.2.88 లక్షల నుంచి రూ.3.02 లక్షల వరకు ఏడాది వేతనం ఉంటుంది.
Sri Gopal Automotive Ltd:ఈ సంస్థలో 5 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
Blue Ocean Biotech:ఈ సంస్థలో 26 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 31న కాకినాడ జిల్లాలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్, పాస్ పోర్ట్ ఫొటోలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8688977277, 8247788247 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలను నిర్వహించనున్న చిరునామా:TTDC Training Center, Near Vimal Cool Drinks Company, Samalkota, Kakinada Dist-533400.
0 Comments:
Post a Comment