చాలా మందికి ఐస్ క్రీం అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లు ఐస్ క్రీం ఎక్కువగా తింటారు. ఇక పెళ్లిళ్లలో ఐస్ క్రీం విపరీతంగా లాగిస్తుంటారు.
ఐస్ క్రీం ఎక్కువ తినడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్ క్రీం లల్లో కొవ్వులు, చక్కెర, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన హెల్త్ కు ఏ మాత్రం మంచివి కావట. వీటివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందట.
కొలెస్ట్రాల్
ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు సమస్యలున్న వారు ఐస్ క్రీమ్ లను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట.
అధిక చక్కెరలు, కొవ్వులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోయే అవకాశముందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ పేషెంట్లు ఐస్ క్రీమ్ ను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయట.
మెదడు
వర్షాకాలంలో ఐస్ క్రీం తీసుకోవడం వల్ల మెదడు స్తంభించిపోతుందట. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందట. ఐస్ క్రీమ్ లల్లో కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అంత తొందరగా అరగవు. దీంతో అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వర్షాకాలంలో ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతోపాటు పాటు కఫం సమస్య కూడా పెరుగుతుంది. కఫం వల్ల దగ్గు, జ్వరం కూడా వచ్చే అవకాశం ఉందట.
తక్కువ తింటే
ఐస్ క్రీం తక్కువ తింటే మంచిదేనట.. ఐస్ క్రీం లో ఉండే చెర్రీస్, పాలు, డ్రై ఫ్రూట్స్ వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. పాలలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయట.
0 Comments:
Post a Comment