Health Tips: రోజు ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు తెలుసా?
Health Tips: ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు.
కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మనకు ప్రయోజనాలు కలిగించేవి కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసా. మనం వాటిని వాడితే మనకు ఆరోగ్యం కచ్చితంగా సిద్ధించడం ఖాయం. అందుకే వాటిని మనం రోజు తీసుకుని మన దేహానికి రక్షణగా చేసుకోవాలని భావిస్తున్నారు.
Health Tips
మనం రోజు ఉదయం నిద్ర లేవగానే ఉసిరిని తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయాన్నే తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు ఉండటంతో దీని వాడకం తప్పనిసరి చేసుకోవాలి. ఉసిరితో చర్మానికి మెరుపు, జుట్టుకు బలం చేకూరుతాయి.
రోజు పరగడుపునే తేనె తీసుకుంటే ఉపయోగమే. ఇందులోకి నిమ్మరసం జోడిస్తే రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికర బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు సమస్య దూరం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అందుకే తేనెను మన ఆహారంలో కలుపుకుని తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.
Indian gooseberry
తులసి నమిలితే కూడా ఎన్నో లాభాలున్నాయి. తులసి ఆకులు రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుసుకుంటే దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు ఎంతో మంచిది. దీంతో రోజు తులసి ఆకులను తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాల దక్కుతాయి. వెల్లుల్లితో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
0 Comments:
Post a Comment