Gujarat | గుజరాత్లో విషాదం.. కేబుల్ బ్రిడ్జి కూలి 400 మంది మిస్సింగ్.. ఏడుగురి మృతి?
గుజరాత్లో మోర్బీ ప్రాంతంలో మచ్చునదిపై కేబుల్ వంతెన కూలిపోవడంతో 400 మందికి పైగా గల్లంతయ్యారు.
ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి మీదుగా వెళుతున్న సందర్శకులు నదిలో పడిపోయారు. ఏడుగురు చనిపోయినట్లు తెలుస్తున్నది. నదిలో పడిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయ పడ్డారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే పౌర, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
0 Comments:
Post a Comment