గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం పరోక్షంగా సాయం చేస్తుంది.
వ్యాయామం గుండెజబ్బులు...
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం పరోక్షంగా సాయం చేస్తుంది. ఇది రక్తపోటును, మధుమేహాన్ని, కొలస్ట్రాల్ స్థాయిలను, శరీర బరువును తగ్గించడంలో ప్రమాదకారకాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె ప్రభావవంతంగా పనిచేయడానికి వ్యాయామం సహకరిస్తుంది. తరచుగా వ్యాయామం చేసే వారిలో రక్తం పలుచబడి గడ్డకట్టే పరిస్థితి తగ్గుతుంది.
అంతేకాదు అడ్రినలిన్ వంటి కొన్ని హార్మోన్ల విడుదలను కూడా గడ్డకట్టే పరిస్థితిని నియంత్రించడంలో ముందుంటుంది.
The exercise prescription
వ్యాయామం శరీరానికి ఔషదం లాంటిది. గుండెపోటు లేదా శస్త్రచికిత్స తరువాత చాలామంది రోగులు డికండీషన్ లోకి వెళిపోతారు. గుండెజబ్బుకు తోడు సుదీర్ఘమైన బెడ్ రెస్ట్ కలిసి అదనంగా మానసిక భారాన్ని కలిగిస్తుంది. కార్డియాక్ సమస్య తరువాత నెమ్మదిగా శరీరాన్ని నడకకు అలవాటు చేయడం గుండెకు మంచిది.
రోజుకు 30 నుంచి 60 నిముషాల వ్యాయామం అవసరం. కానీ మొదటిరోజునే దాన్ని పూర్తిచేయాలి అని అనుకోకూడదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత రోజుకు నాలుగుసార్లు ఐదు నుంచి 10 నిముషాలు పెంచాలి. గుండె సమస్య తరువాత ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు ఆరు వారాల సమయం పడుతుంది.
ప్రత్యేక జాగ్రత్తలు అవసరం...
వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం వంటి ఏవైనా లక్షణాలు ప్రత్యేకంగా వస్తుంటే గమనించాలి.
శరీరం ఎగువ భాగంలో నాభి నుంచి ముక్కు వరకు ఏదైనా అసౌరక్యం, శ్రమతో పెరిగినట్లయితే, అలసటను గమనించినట్లయితే వ్యాయామం చేయడం ఆపి, వైద్యుని సలహా మేరకు వ్యాయామాన్ని కొనసాగించడం మంచిది.
వ్యామామం వల్ల గుండె నీరసపడటం, అసౌకర్యం అనేది నిజం కాకపోవచ్చు. క్రమం తప్పని వ్యాయామంతో చక్కని గుండె పనితీరును సాధించవచ్చు.
0 Comments:
Post a Comment