Search This Blog

Thursday, 13 October 2022

Eye : మండుతున్నాయి కదా అని నులుముకున్న వెంటనే.. చేతిలోకి ఊడిపడిందో కన్ను.. అసలేం జరిగిందో తెలిసి నివ్వెరపోయిన జనం..


ఓ గిరిజన గ్రామానికి (Tribal village) చెందిన ఓ వృద్ధుడికి ఏడాది క్రితం కంటి ఆపరేషన్ (Eye operation) చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత సమస్య దురద మొదలైంది.

దీంతో వైద్యులను సంపద్రించాడు. అయినా ఫలితం లేదు. దీంతో మరో ఆస్పత్రికి వెళ్లాడు. ఇలా చాలా ఆస్పత్రులకు వెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 

రోజురోజుకూ దురద ఎక్కువ అవడంతో పాటూ మండుతుండడంతో గట్టిగా నులుముకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడి కన్ను ఊడిపడింది. వామ్మో! ఇదేంటీ అని భయపడి ఆస్పత్రికి పరుగులు తీశాడు. అక్కడ వైద్యులు చెప్పింది విని చివరకు అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని అడవుల మధ్య ఉన్న గిరిజన గ్రామంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన గంగాధర్ సింగ్ అనే వృద్ధుడు కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు.

 కళ్లలో నీళ్లు వస్తుండడంతో పాటూ సక్రమంగా కనిపించకపోవడంతో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ గ్రామానికి ఓ మహిళ వచ్చింది. వృద్ధుడు ఆమెకు తన సమస్యను వివరించాడు. 

వృద్ధుడితో పాటూ మరికొందరు రోగులను ఎన్‌జీవోల సహకారంతో 2021 నవంబర్‌లో జంషెడ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. తర్వాత రెండో రోజు అందరినీ ఇంటికి పంపించారు.

 అయితే కొన్ని రోజుల తర్వాత సదరు వృద్ధుడికి కంటి దురద, మంట మొదలైంది. దీంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకున్నా ఫలితం లేదు.

ఈ క్రమంలో చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. రోజు రోజుకూ దురద ఎక్కువ అవడంతో రుద్దడం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు గట్టిగా రుద్దుకుని, కంటిలో నీళ్లు పోసుకున్నాడు.

 దీంతో కన్ను ఊడి చేతిలోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వృద్ధుడు షాక్ అయ్యాడు. లబోదిబోమంటూ ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు.. అది గాజు కన్ను అని తేల్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బందితో పాటూ వృద్ధుడి బంధువులంతా షాక్ అయ్యారు. 

ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. వృద్ధుడికి ఆపరేషన్ చేసిన సర్జన్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 

విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే.. ఉన్న కంటినే తీసేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top