Search This Blog

Saturday, 29 October 2022

DRDO Jobs: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!

 DRDO Jobs: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!

  భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1061 

1) జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీవో): 33 పోస్టులు

అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ ఒక పాఠ్యాంశంగా ఉండాలి. (లేదా) బ్యాచిలర్స్ డిగ్రీ (హిందీ, ఇంగ్లిష్)తోపాటు హిందీ/ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్ కోర్సు చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

2) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్‌లో 10 నిమిషాల్లో 100 పదాలు డిక్టేషన్ రాయగలగాలి. 40 నిమిషాలు ట్రాన్‌స్క్రిప్షన్ (ఇంగ్లిష్) ఉంటుంది. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

3) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్‌లో 10 నిమిషాల్లో 80 పదాలు డిక్టేషన్ రాయగలగాలి. 50 నిమిషాలు ట్రాన్‌స్క్రిప్షన్ (ఇంగ్లిష్) ఉంటుంది. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

4) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి. 

5) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 12 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

6) స్టోర్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

7) స్టోర్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 04 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

8) సెక్యూరిటీ అసిస్టెంట్: 41 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

9) వెహికల్ ఆపరేటర్: 145 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

10) ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 18 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

11) ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

జీతభత్యాలు: జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35,400-రూ.1,12,400; స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500-రూ.81,100; ఇతర పోస్టులకు రూ.19900-రూ.63200 వరకు ఉంటుంది.

పరీక్ష విధానం:

పరీక్ష కేంద్రాలు:దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

➤ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2022.

➤ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.12.2022.

➤ టైర్-1 (సీబీటీ) పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.

Notification 

Website

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top