Diabetes Control Tips: ఖర్జూరాలతో కూడా ఎంతటి మధుమేహానికైనా కేవలం 10 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
Dates For Diabetes Control In 15 Days: ఖర్జూరాలు అన్ని సీజన్లలో లభించే పండ్లు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి.
వీటిని ఎక్కువగా వంటకాల రుచిన పెంచడానికి వినియోగిస్తారు. అయితే చాలా మంది వీటిని ఎక్కువగా శీతాకాలంలో తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడి తీవ్రతను పెంచి అనారగోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారికి సందేహం కలగవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతాయని ఆందోళన పడొచ్చు. కానీ వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఖర్జూరంలో లభించే పోషకాలు ఇవే:
ఖర్జూరంలో డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కె, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మధుమేహం ఉన్నవారికి ఖర్జూర ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?:
ఖర్జూరలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే గుండె సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డయాబెటిక్ పేషెంట్లు రోజులో ఎన్ని ఖర్జూరాలు తినాలి..?:
ఖర్జూరాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగ కుండా కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఒక రోజులో 2 ఖర్జూరాలను హాయిగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకోకుండా ఉంటే మంచిది.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం ఎముకలను బలపరుస్తుంది.
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు సులభంగా దూరమవుతాయి.
అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు కూడా సులభంగా తగ్గుతారు.
0 Comments:
Post a Comment