*📚✍️దీపావళికైనా డీఏ*
*బకాయిలివ్వండి✍️📚*
*♦️ఏపీజేఏసీ- అమరావతి*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ప్రభుత్వం ఉద్యోగులకు పాత డిఏ బకాయిలను దీపావళి కానుకగా చెల్లిస్తే లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఏపీజేఏసీ- అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు విజ్ఞప్తి చేశారు. డీఏ ఎరియర్స్ 2018 జూలై నుండి కోట్లాది రూపాయలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన ఏ అంశం పరిష్కరించకపోయినా ప్రభుత్వానికి సహకరిసు _న్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు అనేక రాష్ట్రాలు డీఏలతో పాటు దీపావళి కానుకగా అందించటంతో పాటు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అదనంగా బోనస్ ప్రకటించాయని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా దసరా, దీపావళి పండుగలకు కొత్త డీఏలు ఇవ్వటంతో పాటు పెండింగ్ బకాయిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించారని తెలిపారు. ఏపీజేఏసీ- అమరావతి పక్షాన ఇప్పటికే తేదీ ఈనెల 12వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కలిసి, మా సంఘం లేఖ ద్వారా 2018 జూలై నుండి రావాల్సిన పాత డీఏ బకాయిలతో సహా 2022- జనవరి మరియు జూలై రెండు డీఏలు, ఇతరత్రా బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న, వారికి రావాల్సిన డబ్బులు కూడా సంవత్సరాల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడం వలన తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై, అసలు డీఏలు ఇస్తారా, లేదా అనే ఆందోళనతో ఉద్యోగ సంఘాలపై మండిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ దీపావళి పండుగ కానుకగానైనా ముఖ్యమంత్రి వైఎస్ఆగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించి పెండింగులో ఉన్న 2022- జనవరి, జూలై డీఏలు ప్రకటించి పది లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment