Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు టైమ్‌కి కట్టకపోయినా ఏం కాదు.. ఈ రూల్ తెలుసుకోండి..
Credit Card Due Date | క్రెడిట్ కార్డుల వినియోగం నానాటికీ పెరిగిపోతూనే వస్తోంది.
వీటిని ఉపయోగించే వారి సంఖ్య పైపైకి చేరుతూనే వస్తోంది. క్రెడిట్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. వీటి ద్వారా ఎన్నో బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రివార్డు పాయింట్లు, ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ విత్‌డ్రాయెల్ ఇలా చాలా బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతూ వస్తోంది. అయితే క్రెడిట్ కార్డు వాడే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
క్రెడిట్ కార్డుల ద్వారా ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భారీగా వడ్డీ రేటు పడుతుంది. ఇంకా అదిక చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు వాడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డు బిల్లును క్లియర్ చేసుకుంటూ రావాలి. లేదంటే క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది.
అయితే క్రెడిట్ కార్డు కలిగిన వారు డ్యూ డేట్ కల్లా కచ్చితంగా బిల్లు మొత్తాన్నిచెల్లించాలి. ఒకవేళ నిర్దిష్ట తేదీలోపు కట్టకపోయినా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అదేంటి? క్రెడిట్ కార్డు బిల్లు డేట్ దాటిన తర్వాత పేమెంట్ చేస్తే ఇబ్బంది ఉండదా? అని ఆలోచిస్తున్నారా?
మీరు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ దాటిన తర్వాత పేమెంట్ చేసినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. క్రెడిట్ స్కోర్ దెబ్బతినదు. పెనాల్టీలు వంటివి కూడా పడవు.
కానీ మీరు క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ దాటిన తర్వాత మూడు రోజుల్లోగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్యూ డేట్ దాటి మూడు రోజులు అయిన తర్వాత బిల్లు పేమెంట్ చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. పెనాల్టీలు పడతాయి.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. డ్యూ డేట్ దాటిన తర్వాత మూడు రోజుల వరకు పేమెంట్ చేయడానికి గడువు ఉంటుందని గుర్తించుకోవాలి. ఈ కాలంలో కార్డు జారీ సంస్థలు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోయినా కూడా ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేయకూడదు. మూడు రోజులు దాటితే మాత్రం డ్యూ డేట్ నుంచే చార్జీల వడ్డింపు ఉంటుంది.
0 Comments:
Post a Comment