Credit Card Dues | క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. నానాటికీ క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతూనే వస్తోంది. క్రెడిట్ కార్డు వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. రుణ ఊబిలో కూరుకుపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.
క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా వాటిని ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. దీంతో క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చు. అందుకే అలర్ట్‌గా ఉండాలి.
చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోవచ్చు. కేవలం మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తూ రావొచ్చు. కొంత మంది అయితే అస్సలు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా ఉంటారు. వీరి కన్నా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించే వారు చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు.
ఒక్క రూపాయి కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేని వారి విషయానికి వస్తే.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బిల్లు కట్టకపోతే లేట్ పేమెంట్ చార్జీలు పడతాయి. అలాగే వడ్డీ కూడా పెరుగుతూ వస్తుంది. క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 25 శాతం వరకు ఉంటుంది. ఇది చాలు మిమ్మల్ని రుణ ఊబిలో తోయడానికి.
మీరు రుణ ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని అనుసరిస్తే.. ఇబ్బందులు ఉండవు. కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లిస్తూ రావాలి. క్రెడిట్ కార్డు బిల్లు పూర్తి మొత్తం కట్టలేకపోతే ఈ విధానాన్ని అనుసరించాలి. దీని వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే.. దాన్ని చెలించడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు డేంజరస్ లెవెల్‌కు చేరడానికి ముందే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్‌గా మార్చుకోవచ్చు.
అలాగే క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మళ్లీ ఉపయోగించొద్దు. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే.. వేరే కార్డు ద్వారా కూడా షాపింగ్ చేయొద్దు. ఇలా చేస్తే.. రెండు కార్డులపై కూడా బిల్లు భారం పెరుగుతుంది.
అందువల్ల మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే మాత్రం ఈ టిప్స్‌ను ఫాలోకండి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే ఆ ప్రభావం ఇతర రుణాలపై కూడా పడుతుంది. అందుకే క్రెడిట్ కార్డు వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి.
0 Comments:
Post a Comment