Cataract in India: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చిన్నపిల్లల్లో అంధత్వానికి కారణం కంటిశుక్లాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రారంభ దశలోనే గుర్తించకపోతే చూపును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కంటిశుక్లాలను సాధారణంగా సేఫ్డ్ మోటియా అని పిలుస్తారు. భారతదేశంలో ప్రతి 10,000 మంది పిల్లల్లో ఆరుగురు ఈ సమస్యతో పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. బాల్య అంధత్వానికి 10 శాతం కంటి శుక్లాలు కారణమవుతున్నాయి.
అనేక కారణాల వల్ల పిల్లలకు కంటిశుక్లాలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కంటిశుక్లాలు అంటే నేచురల్ లెన్స్ పారదర్శకతను ప్రభావితం చేసే మెడికల్ కండిషన్.
కంటి లోపల సాధారణంగా పారదర్శక, స్ఫటికాకార లెన్స్ అపారదర్శకంగా లేదా మబ్బుగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. పిల్లలలో కారణాలు భిన్నంగా ఉంటాయి.
పట్టణప్రాంతాల్లో ఎక్కువ
10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే, బెస్ట్ ప్రినేటల్ కేర్, మెటర్నల్ ఇన్ఫెక్షన్ల తగ్గింపు, క్లీన్ డెలివరీ పద్ధతుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. పట్టణ జనాభాలో స్టెరాయిడ్ దుర్వినియోగం, జన్యుపరమైన సమస్యలు, జీవక్రియ రుగ్మతలు, అకాల జననాలు వంటి ఇతర కారణాల వల్ల సమస్య క్రమంగా పెరుగుతోంది.
పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లోని మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌లోని నేత్ర వైద్యుడు డాక్టర్ సత్య ప్రసాద్ బాల్కీ News18.comతో మాట్లాడుతూ.. కొందరిలో పుట్టుకతో కంటిశుక్లాలు వస్తాయని చెప్పారు. ఇది యూనిలేటరల్ లేదా బైలేటరల్గా ఉండవచ్చని అన్నారు.
సాధారణంగా ప్రసూతి అంటువ్యాధులు లేదా డౌన్ సిండ్రోమ్ వంటి ఇతర సిస్టెమిక్ అనామలీస్తో సంబంధం ఉంటుందని వివరించారు. సుమారు 5 సంవత్సరాల క్రితం పట్టణ ప్రాంతంలో తన ప్రాక్టీస్‌లో సంవత్సరానికి 6-7 కేసులను చూసినట్లు సత్య ప్రసాద్ బాల్కీ చెప్పారు.
ఇప్పుడు తనకు ఏడాదికి 10-15 కేసులు వస్తున్నాయని తెలిపారు. సంఖ్యలు ఆందోళనకరంగా లేనప్పటికీ, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, కంటిశుక్లాలకు వెంటనే పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో చిన్ననాటి అంధత్వానికి పిల్లలలో కంటిశుక్లాలు ప్రధాన కారణమని నోయిడాలోని ఐకేఆర్ ఐ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సౌరభ్ చౌదరి తెలిపారు. ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్‌లోని ఆప్తాల్మాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమృతా కపూర్ చతుర్వేది మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది పిల్లలు కంటిశుక్లం కారణంగా అంధులు అవుతున్నారని, ప్రతి సంవత్సరం 20,000-40,000 మంది పిల్లలు ఈ పరిస్థితితో పుడతారని అంచనాలున్నాయని వివరించారు.
రోగనిర్ధారణ ఎలా?
తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సంరక్షకులు పిల్లల కళ్లలో లోపాలను గమనిస్తుండాలి. చూపు తగ్గడం, వస్తువులను గుర్తించడంలో వైఫల్యం, కంటి మధ్యలో తెల్లటి మచ్చలు, సామాజిక విరక్తి, కంటి డీవియేషన్ వంటి వాటిని కంటిశుక్లాల ప్రారంభ దశగా గుర్తించాలి. చిన్ననాటి కంటిశుక్లాల సంకేతాలు వేర్వేరుగా ఉంటాయి.
కొందరికి ఒకటి లేదా రెండు కళ్లలో క్లౌడీ లెన్సెస్ ఉంటాయి. ఇంకొందరిలో నల్లని ప్రాంతంలో తెల్ల మచ్చలు కనిపిస్తాయి. కంటిశుక్లం ప్రారంభంలో గుర్తించకపోతే చూపు కోల్పోయే అవకాశం ఉంది.
కంటి శుక్లాలకు కారణాలు ఏంటి?
పీడియాట్రిక్ కంటిశుక్లాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం పుట్టుకతో వస్తుంది. రెండో రకం, పిల్లలు పుట్టిన తర్వాత అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే చిన్నపిల్లలకు కంటిశుక్లాలు వచ్చే అవకాశం ఉంది.
రెండో కంటితో కలవడం లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పుట్టేపిల్లలో శుక్లాలు ఏర్పడుతాయి. ఈ రకమైన కంటిశుక్లాలు జన్యుపరమైన కారణాల వల్ల సంభవించవచ్చు.
గర్భధారణ సమయంలో తల్లి స్టెరాయిడ్స్ వాడటం వల్ల పిల్లల్లో కంటిశుక్లాలు వచ్చే ప్రమాదం ఉంది. స్టెరాయిడ్ దుర్వినియోగం, కంటికి గాయం, పుట్టుకతో వచ్చే గ్లాకోమా, లేదా రెటీనా శస్త్రచికిత్స తర్వాత కూడా సమస్య తలెత్తే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో తల్లికి మీజిల్స్ వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, పిల్లలకు పుట్టుకతో వచ్చే కంటిశుక్లాలు అభివృద్ధి చెందుతాయి. పోషకాహార లోపం, జీవక్రియ సమస్యలు, గర్భధారణ మధుమేహం లేదా తల్లిలో మెడిసిన్ అలర్జీలు కూడా దీనికి కారణం కావచ్చు.
చికిత్స ఉందా?
ఈ సమస్యకు వీలైనంత త్వరగా చికిత్స చేయడం తప్పనిసరి. పిల్లల లక్షణాలు, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా చికిత్స ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి కూడా నిర్ణయిస్తారు. పిల్లలకి కొన్ని సందర్భాల్లో అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లు అవసరం కావచ్చు.
పీడియాట్రిక్ క్యాటరాక్ట్స్లో చికిత్స పద్ధతులు ఆశాజనకంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత, గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్, కాంటాక్ట్ లెన్సులు లేదా అక్లూజన్ థెరపీ పిల్లలకి సహాయపడతాయని చెబుతున్నారు. శస్త్రచికిత్స పద్ధతులు, ఇంట్రాకోక్యులర్ లెన్స్‌లలో పురోగతితో చిన్ననాటి కంటిశుక్లాల చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది.
నివారణలో సవాళ్లు
పిల్లలకు కంటిశుక్లాల శస్త్రచికిత్సలో అనేక సవాళ్లు ఉన్నాయి. పిల్లల కళ్లు చిన్నవిగా ఉండటం పెద్ద సమస్య. పిల్లలలో కంటిశుక్లాల శస్త్రచికిత్స పెద్దవారి కంటే సాంకేతికంగా చాలా క్లిష్టంగా ఉంటుంది. అనస్థీషియా ప్రమాదం ఉంది.ఇంట్రాకోక్యులర్ లెన్స్ పవర్‌ను జాగ్రత్తగా గణించడం అవసరం.
Opశస్త్రచికిత్సకు మైక్రోస్కోపిక్ బయోమెట్రిక్స్ వంటి అధునాతన టెక్నాలజీ అవసరమవుతుంది. శస్త్రచికిత్స అనంతరం పిల్లలకు కంటిలో మంట వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలలో గ్లాకోమాకు దారితీసే ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ ప్రమాదం కూడా ఉంది.
0 Comments:
Post a Comment