ఇంటర్నెట్ డెస్క్: గుండెకు ఆపరేషన్ అంటే ఛాతీని తెరవాల్సి వచ్చేది.. ఈ సమయంలో రక్తం కూడా ఎక్కువగానే పోతుంది.
ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిందే. ఇటీవల చిన్న చిన్న రంధ్రాలను చేసి గుండెకు చికిత్స చేస్తున్నారు.
దీన్నే మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ అంటారని ప్రముఖ కార్డియా ధోరాసిక్ సర్జన్ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు.
గతంలో చేసిన శస్త్రచికిత్సలతో సమయం, వ్యయం, రక్తం ఎక్కువగా వృథా అయ్యేదని తెలిపారు.
చిన్న రంధ్రాలతోనే సరి
ఛాతీ తెరవకుండానే గుండె సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సలను చేయడానికి అవకాశం ఉంది. 5 సెం.మీటర్ల కోత పెట్టి సర్జరీ చేస్తున్నారు.
దీంతో రక్తస్రావం ఉండదు. నొప్పి తక్కువ. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రోగి తొందరగా కోలుకొని ఇంటికి వెళ్లి సొంతంగా పనులు చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment