Camphor For Arthritis Pain: హిందూ సాంప్రదాయంలో కర్పూరాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ వ్యాధిల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది సీజనల్ వ్యాధులను ఎదుర్కోంటున్నారు.
అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కర్పూరాన్ని క్రమం తప్పకుండా వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. కర్పూరాన్ని తీవ్ర వెన్ను నొప్పులకు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వినియోగించవచ్చు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలే చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్పూర ప్రయోజనాలు:
కర్పూరాన్ని చాలా మంది పూజల్లో హారతి కార్యక్రమంలో వినియోగిస్తారు. సాధారణంగా మూడు రకాలు జపనీస్, భీమ్సేని, పత్రి కపూర్ లభిస్తుంది. రెండు రకాలను మాత్రమే ఔషధాల్లో వినియోగిస్తారు.
ఇందులో ఉండే గుణాలు నెగెటివ్ ఎనర్జీని కూడా దూరం చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి వీటిని ఎక్కువ ఇళ్లలో పెట్టుకోవాడానికి ఇష్టపడతారు.
ఔషధంగా ఎలా ఉపయోగించాలి?
కర్పూరం నూనె రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మొటిమలు, జిడ్డుగల చర్మం దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. మెడ నొప్పులతో బాధపడేవారు కర్పూరంతో తయారు చేసి బామ్‌ను అప్లై చేయడం వల్ల కేవలం 12 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
స్కిన్ ఇన్ఫెక్షన్స్కి చెక్:
స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయిన చర్మంపై దురదలు, మంటలకు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ కర్పూరాన్ని మిక్స్ చేసి సమస్య ఉన్న ప్రదేశంపై అప్లై చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే కేవలం 40 నిమిషాల్లో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సీజన్ మారుతున్నప్పుడు వచ్చే వ్యాధులు నుంచి సులభంగా చెక్ పెట్టొచ్చు.
ముఖ్యంగా చాలా మంది చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడతారు. అయితే దీని కోసం వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల తర్వలోనే ఉపశమనం లభిస్తుంది.
0 Comments:
Post a Comment