బ్రెయిన్ స్ట్రోక్.. సైలెంట్ కిల్లర్. దమానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకుండా నిత్యం బిజీగా గడిపే వారిలో ఈ స్ట్రోక్ కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం మహిళల్లో
నేడు వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి):బ్రెయిన్ స్ట్రోక్.. సైలెంట్ కిల్లర్. దమానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకుండా నిత్యం బిజీగా గడిపే వారిలో ఈ స్ట్రోక్ కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో మహిళలూ దీని బారిన పడే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి.
హైదరాబాద్‌లోనే ఎక్కువ..
కొలకత్తా, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. పాతికేళ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఇందులో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు.
85 శాతం మందికి వచ్చినట్లే తెలియదు
బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ విషయం కొన్నిసార్లు రోగికి తెలియకపోవచ్చా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. 85శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన విషయాన్ని గుర్తించలేకపోతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
కేరళ రాష్ట్రం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్ట్రోక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ వివేక్ కె. నంబియార్, డాక్టర్ కార్తీకరాణి, డాక్టర్ రేమ్యా సుదేవన్, డాక్టర్ అభిష్ సుధాకర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
మనదేశంలో గుండె జబ్బుల తర్వాత ఎక్కువ మంది స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఈ నివేదిక స్పష్టం చేసింది.
20 శాతం కేసులు పెరిగాయి
కొవిడ్ తర్వాత హైదరాబాద్‌లో కనీసం 20 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగాయి. కొవిడ్ ఇన్ఫెక్షన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచింది. మెదడు ధమనులలో సులభంగా రక్తం గడ్డకట్టడం చోటు చేసుకుంటుంది.
70 నుంచి 80 శాతం మద్యపానం, ధూమపానం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నట్లు తేలింది. ప్రతి ఆరుగురిలో ఒకరు తమ జీవిత కాలంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఉండే అవకాశాలున్నాయి.
నిద్రలేమి, ఎక్కువ గంటలు పనిచేయడం, రాత్రి పార్టీలలో పాల్గొనడం, మద్యం తాగడం వంటి కారణాలు స్ట్రోక్ రావడానికి దోహదపడుతున్నాయి.
డాక్టర్ సుధీర్‌కుమార్, న్యూరాలజీ విభాగం అధిపతి, అపోలో ఆస్పత్రి
పొంచి ఉన్న ముప్పు..
చాలా మందిలో జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిళ్లతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లో ఆస్పత్రికి చేరుకుంటే దానిని నివారించవచ్చు. కొందరిలో వైరల్ జబ్బులతో ఇది వస్తుంది.
రక్తనాళంలో క్లాట్ ఏర్పడి వెంటనే కరిగిపోతోంది. ఇలాంటి వారికి ఐదేళ్లలో పెద్ద స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంది. క్లాట్ లేకపోతే మున్ముందు స్ట్రోక్ రాకుండా ఉండడానికి మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
జీవనశైలి మార్పులు, మందులతో మున్ముందు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చెక్ పెట్టవచ్చు. రోజూ 40 నిమిషాలు తప్పకుండా నడవాలి. ఆహార నియమాలు పాటించాలి. తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మద్యపానం, స్మోకింగ్ మానివేయాలి.
0 Comments:
Post a Comment