Key decision by AP Sarkar
ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తాజాగా గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమ్యే ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ వెసులుబాటు కల్పించింది.
ఇదిలావుంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు దరఖాస్తు, వివిధ ధ్రువీకరణ పత్రాల మంజూరులో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వస్తోంది. వాటికి మరిన్ని అధికారులు ఇస్తూ ప్రజలకు సులువుగా పనులు అయ్యేలా చూస్తోంది.
తాజాగా గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమ్యే ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ వెసులుబాటు కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికేట్ల కోసం అవసరమైన ప్రతీసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయం అమల్లోకి తెచ్చిది. ఏదైనా ధ్రువీకరణ పత్రం కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుని పై అధికారులు ఆమోదం లభిస్తే.. ఇంకోసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు సర్టిఫికేట్ జారీ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది.
ఇన్ కమ్, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర కొన్ని సర్టిఫికేట్ల జారీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ధ్రువీకరణ పత్రం ఒకసారి పొంది ఉండి, మరోసారి అదే సర్టిఫికేట్ మళ్లీ అవసరమైనప్పుడు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంతకు ముందు పొందిన సర్టిఫికేట్‌ను అప్పటికప్పుడు వెంటనే ఇవ్వనున్నారు. అవసరమైతే మూడు, నాలుగు ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వనున్నారు. దీని కోసం సర్టిఫికేట్లను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా తమ గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నివసించే ప్రజల సర్టిఫికేట్ల డేటాను కంప్యూటర్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. అసవరమైనప్పుడు ప్రజలకు వాటిని వెంటనే జారీ చేయనున్నారు.
సర్టిఫికేట్ల జారీలో సాంకేతికను మరింత ఉపయోగించుకునేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఏదైనా దరఖాస్తుకు అప్లై చేసుకున్న తర్వాత.. అధికారుల ఆమోదం లభించిన వెంటనే దరఖాస్తుదారుడి నెంబర్‌కి కాపీ లింక్ వెళ్లనుంది. ఆ లింక్ ద్వారా సర్టిఫికేట్‌ను ఈజీగా డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మళ్లీ సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ విధానం ఉపయోగపడనుంది. బస్సు, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వాట్సప్ నెంబర్‌కు టికెట్ లింక్ ఎలా వస్తుందో.. అదే తరహాలో వాట్సప్‌కి సర్టిఫికేట్ లింక్ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా ప్రజలకు సేవలు మరింత వేగంగా అందించవచ్చని భావిస్తోంది.
0 Comments:
Post a Comment