కొందరు విద్యార్థులు పరీక్షల సమయంలో కాపీయింగ్ కోసం కొత్త పద్ధతులను అవలంబించడం చూసేవుంటాం. వారు కాపీ కొట్టే విధానం చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే.
అలాంటి ఉదంతం ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఉదంతం స్పెయిన్‌లో చోటుచేసుకుంది. లా విద్యార్థి ఒకరు కాపీ చేయడానికి ప్రత్యేకమైన మార్గాన్ని అవలంబించాడు.
అయితే అతను కాపీచేస్తూ ప్రొఫెసర్ చేతికి చిక్కాడు. ఆ విద్యార్థి కొన్ని పెన్నులపై చిన్నపాటి అక్షరాలతో నోట్స్ రాసుకున్నాడు.
అతను వీటిని కోడ్ వర్డ్‌లో రాసుకున్నాడు. అయితే ఎగ్జామినర్ సదరు విద్యార్థి కాపీ చేస్తుండగా పట్టుకున్నాడు.
ఆ ప్రొఫెసర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విద్యార్థి ఉపయోగించిన పెన్నులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ పెన్నును తొలిసారి చూడగానే సాధారణమైనదిగానే కనిపిస్తుంది.
అయితే పరికించి చూస్తే పెన్నులపై ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. విద్యార్థి ఈ కాపీ పద్ధతిని చాలా తెలివిగా రూపొందించాడు.
లా స్టూడెంట్ కాపీయింగ్‌ను పట్టుకున్న ప్రొఫెసర్ పేరు యోలాండా డి లుచ్చి. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ @procesaleandoలో ఈ చిత్రాలను పంచుకున్నారు. దానిని ఆర్ట్ అని పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కి దాదాపు 3 లక్షల లైక్‌లు వచ్చాయి. 25 వేల వరకు రీట్వీట్ అయ్యింది.
0 Comments:
Post a Comment