నీరు లేకుండా భూమిపై జీవితాన్ని ఊహించలేం. నీరు లేకుండా మన దినచర్య ముందుకు సాగదు. భారతదేశంలోని చాలా నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని లేదా అంతరించిపోయే దశలో ఉన్నాయనే వార్తలు వినేవుంటాం.
మన దేశంలో తాగునీటి అవసరాలలో అధికభాగం నదుల నీటితోనే తీరుతుంది. ప్రపంచంలోని గొప్ప నాగరికతలు నదుల ఒడ్డునే అభివృద్ధి చెందాయి.
అయితే ఒక్క నది కూడా లేని దేశాన్ని ఊహించగలమా? అలాగేవుంటే అక్కడి ప్రజలు తమ నీటి అవసరాలను ఎలా తీర్చుకుంటారు? అనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. అయితే ఇప్పుడు మనం నది లేని దేశం గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో ఒక్క నది లేదా సరస్సు కూడా లేని ఏకైక దేశం సౌదీ అరేబియా. అయితే ఇప్పుడది సంపన్న దేశాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. సౌదీ అరేబియాలో వర్షం కూడా చాలా తక్కువగా కురుస్తుంది.
సంవత్సరానికి ఒకటి నుండి రెండు రోజులు మాత్రమే వర్షం కురుస్తుంది. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా అంతగా ఉండవు.
సౌదీ అరేబియా నీటి కోసం అత్యధికంగా ఖర్చు చేయడానికి ప్రధాన కారణం ఇదే. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం తన జీడీపీలో రెండు శాతాన్ని నీటి కోసం ఖర్చు చేస్తోంది.
సౌదీ అరేబియా ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. నేటికీ అక్కడ నీటి కోసం ప్రజలు బావులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడి ప్రజలందరికీ నీరు అందించేందుకు భూగర్భ జలాలు సరిపోవడం లేదు.
ఇక్కడ భూగర్భ జలాలు కూడా త్వరలో అడుగంటిపోనున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సౌదీ అరేబియాలో సముద్రపు నీటిని తాగడానికి వినియోగిస్తారన్నది ఆసక్తికరమైన విషయం.
అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది. నదులు లేనప్పటికీ సౌదీ అరేబియాకు రెండు వైపులా సముద్రం ఉంది. పశ్చిమాన ఎర్ర సముద్రం, తూర్పున పర్షియన్ గల్ఫ్ ఉన్నాయి. ఈ రెండు సముద్రాలు వాణిజ్య ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
0 Comments:
Post a Comment