ఏపీలో మరో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ఆధ్రప్రదేశ్‌లో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు రెవెన్యూ డివిజన్‌లో ఏటిపాక, చింతూరు, కూనవరం, రామచంద్రాపురం మండలాలు ఉండనున్నాయి. ఇక, జగన్ సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త జిల్లాలతో పాటుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
0 Comments:
Post a Comment