Airtel 5G ప్లస్ ఇప్పుడు వచ్చేసింది. ఈ గేమ్-ఛేంజింగ్ టెక్నాలజీని ఇప్పుడే అనుభూతి చెందండి..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్, Bharti Airtel ఎనిమిది భారతీయ నగరాల్లో తమ, Airtel 5G ప్లస్ సేవలు ప్రారంభించింది.
ఇప్పుడు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ఉన్న Airtel వినియోగదారులు ఇప్పుడు అల్ట్రా-ఫాస్ట్ Airtel 5G ప్లస్ సేవలను ఆస్వాదించవచ్చు, అలాగే త్వరలోనే దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడానికి Airtel ప్రయత్నిస్తోంది. ఆయా నగరాల్లో ఇప్పటికే 5G ఫోన్లు ఉపయోగిస్తోన్న కస్టమర్లు, Airtel 5G ప్లస్ సర్వీస్ ద్వారా 30 రెట్లు అధిక వేగాన్ని పొందవచ్చు, ఈ సేవలు పూర్తిగా విస్తరించే వరకు ఈ అధిక వేగాన్ని ప్రస్తుతం ఉన్న 4G డేటా ప్లాన్ ద్వారా ఆస్వాదించవచ్చు. భారతదేశంలోని ఇతర పట్టణ ప్రాంతాలకు చెందిన వినియోగదారులు కూడా మార్చి 2023 నాటికి Airtel వారి 5G నెట్‌వర్క్‌ను పొందవచ్చు, ఈ రకంగా ఇది అత్యంత వేగవంతంగా విస్తరించిన నెట్వర్క్ అవుతుంది.
Airtel 5G ప్లస్: రేపటి-తరానికి కావాల్సిన మొబైల్ నెట్వర్క్
Airtel 5G ప్లస్ అనేది రేపటి-తరానికి కావాల్సిన మొబైల్ నెట్వర్క్. దీని ద్వారా కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 4G నెట్‌వర్క్‌లతో పోల్చితే 30 రెట్లు అధికంగా వేగాన్ని అందివ్వడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడుతోన్న టెక్నాలజీతో Airtel 5G ప్లస్ సర్వీస్ నడుస్తోంది. అంటే 5G-సౌకర్యం గల ఏదైనా ఫోన్లో, ప్రస్తుతం ఉన్న Airtel SIM ద్వారానే ఈ సర్వీస్ పొందవచ్చు, తద్వారా 5Gకి మారడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.
ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సంస్థ అత్యంత అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్ ఉపయోగిస్తోంది, తద్వారా వినియోగదారులకు చక్కని మొబైల్ వినియోగ అనుభూతి అందుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఎటువంటి లాగ్ లేని గేమింగ్, హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, ఇన్స్టంట్ కంటెంట్/ఫైల్స్ అప్లోడింగ్, డౌన్లోడింగ్ ఇంకా మరెన్నో సదుపాయాలను ఒక్కసారి ఊహించుకోండి!
అత్యధిక ఇంటర్నెట్ వేగం మాత్రమే కాకుండా, అత్యద్భుతమైన వాయిస్ అనుభూతి, సూపర్‌ఫాస్ట్ కాల్ కనెక్షన్‌ను కూడా Airtel అందిస్తోంది. 5G సర్వీస్ అందించడం ద్వారా ప్రత్యేకమైన పవర్ రిడక్షన్ పరిష్కారంతో పాటు, పర్యావరణాన్ని కూడా నెట్వర్క్ దృష్టిలో పెట్టుకుంది.
మీ ఫోన్లో Airtel 5G ప్లస్ ఉపయోగించడం ఎలా?
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ఇప్పటికే ఉన్న Airtel కస్టమర్లు, వారి వద్ద ఉన్న 5G సౌకర్యం గల ఫోన్ ద్వారా Airtel 5G ప్లస్ సేవలను ఆస్వాదించడం మొదలుపెట్టవచ్చు! Airtel 4G SIMలు ఇప్పటికే 5G సౌకర్యంతో యాక్టివేట్ చేయబడ్డాయి, అంటే మీ వద్ద ఏదైనా 5G-సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, మీరు Airtel 5G ప్లస్ నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చు.
వారి ప్రాంతంలో 5G సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కస్టమర్లు Airtel థ్యాంక్స్ యాప్‌ను కూడా వినియోగించవచ్చు. Airtel థ్యాంక్స్ యాప్ ద్వారా వారి స్మార్ట్‌ఫోన్‌లో 5G సౌకర్యం ఉందో లేదో అని కూడా కస్టమర్లు తెలుసుకోవచ్చు.
భారతదేశపు 5G విప్లవంలో Airtel ముందంజ
Airtel 5G ప్లస్ సేవల్లో భాగంగా పూర్తిస్థాయి పోర్ట్‌ఫోలియో సర్వీస్‌లను కంపెనీ అందిస్తోంది, వీటిలో భాగంగా హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, లాగ్-ఫ్రీ గేమింగ్, అతి స్పష్టమైన వీడియో కాన్ఫరెన్సింగ్‌కు సూపర్‌ఫాస్ట్ యాక్సెస్ అందుతుంది. అల్ట్రా-స్పీడ్ సేవలను అందించడం ద్వారా, దేశపు ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం పడనుంది. తయారీ రంగం, రీటెయిల్ రంగం, లాజిస్టిక్ రంగం లాంటి వివిధ రకాల రంగాలపై ఇది సకారాత్మక ప్రభావం చూపించనుంది.
గత కొన్నేళ్లుగా వివిధ రకాల శక్తిమంతమైన ప్రదర్శనల ద్వారా 5G రంగంలో పారిశ్రామిక లీడర్‌గా Airtel ఎన్నోసార్లు తనను తాను నిరూపించుకుంది. హైదరాబాద్ నగరంలో భారతదేశపు మొదటి లైవ్ నెట్‌వర్క్‌ను ఇది ఎనేబుల్ చేసింది. అలాగే టెలికాం శాఖ వారు అందించిన టెస్ట్ నెట్‌వర్క్‌లో భారతదేశంలోనే మొదటి 5G-ఆధారిత హోలోగ్రామ్‌ను ఇది ఆవిష్కరించి, టీవీ సదుపాయం లేని కాలంలో ప్రఖ్యాత ప్రపంచ కప్ మ్యాచ్‌లో కపిల్ దేవ్ చేసిన 175 పరుగులను ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.
అపోలో హాస్పిటల్‌తో సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి 5G-అనుసంధానిత అంబులెన్స్‌ను Airtel ప్రవేశపెట్టింది, అలాగే తయారీ రంగంలో ఉత్పాదకత పెంచడానికి Boschతో కలిసి ప్రైవేట్ టెస్ట్ 5G నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసింది.
భారతదేశంలో Airtel 5G ప్లస్ సేవల ప్రారంభం గురించి Bharti Airtel మేనేజింగ్ డైరెక్టర్, CEO గోపాల్ విట్టల్ మాట్లాడుతూ- “గత 27 ఏళ్లుగా భారతదేశ టెలికాం విప్లవంలో Airtel ముందు వరుసలో ఉంది. అలాంటి మా ప్రయాణంలో ఈరోజు మరొక మైలురాయిగా నిలవనుంది. మా కస్టమర్లకు ఉత్తమ అనుభూతిని అందించడానికి మేము అత్యంత మెరుగైన నెట్‌వర్క్‌ను రూపొందించాం.”
కస్టమర్ల విషయంలో Airtel చాలా నిబద్ధతగా ఉంటుందని, వారు లేకుండా సంస్థ లేదని, అందుకే 5Gకి మారడాన్ని వీలైనంత సులభతరం చేయడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. “మా విషయానికి వస్తే, మా కస్టమర్ల అనుభవం మాకు ప్రాధాన్యత. కాబట్టి కస్టమర్ల వద్ద ఇప్పటికే ఉన్న SIMతో ఏదైనా 5G హ్యాండ్సెట్ ఉపయోగించే విధంగా దీనికి పరిష్కారం చూశాం. ఇలా కస్టమర్ల దృష్టి నుండి ఆలోచించి, ఇలాంటి 5G పరిష్కారం తీసుకురావడం వల్ల పర్యావరణానికి కూడా మంచి జరుగుతోంది. Airtel 5G ప్లస్ ద్వారా ప్రజలు కమ్యూనికేట్ అయ్యే, జీవించే, పనిచేసే, కనెక్ట్ అయ్యే, ఆడుకునే విధానాల్లో ముందు ముందు చాలా మార్పులు రానున్నాయి.”
0 Comments:
Post a Comment