రైతులకు బంపర్ ఆఫర్... వారికి తెలియకుండానే అకౌంట్లో రూ. 50 వేల నగదు జమ
గుర్తుతెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ నుండి రూ. 10 వేల నుండి 50 వేల లోపు నగదు జమ అవుతుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్లు, గట్టికళ్ళు గ్రామాలలో వంద మంది పైచిలుకు రైతుల అకౌంట్లో నగదు జమ కావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎలాంటి అకౌంట్ నెంబర్ లేకుండా తమ అకౌంట్ లో నగదు జమ కావడంతో కొంతమంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది భయాందోళనకు గురవుతున్నారు. రెండు మూడు రోజుల నుండి మొబైల్ ఫోన్లకు నగదు జమైనట్టు మెసేజ్ రావడంతో దగ్గర్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. డబ్బులు పడకుండా ఉన్న ప్రజలు కాళ్ళు అరిగేలా బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారు.
రాయపర్తి మండలం కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో, కొండాపురం గ్రామంలోని కెనరా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే నగదు జమ అవుతుండటం గమనార్హం. మిగతా బ్యాంకుల అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తులకు అమౌంట్ జమ కాలేదు. ఈ డబ్బు ఏ విధంగా అకౌంట్లో జమ అవుతుందో బ్యాంక్ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా కావాలనే తమ అకౌంట్లో నగదు చేస్తున్నారా... డిజిట్ నెంబర్ తప్పిదంతో అకౌంట్లో నగదు జమ అవుతుందా ! బ్లాక్ మనీయే ఏం చేయాలో అర్థం కాక రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తున్నారా అనే కోణంలో ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. కానీ ఈ సంఘటనకు సంబంధించి మండలం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవడం అటు రైతులు ఇటు స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
0 Comments:
Post a Comment