అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లోని పోస్టుల భర్తీకి 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 269 పోస్టుల భర్తీకిగానూ ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్లు, అలాగే మూడు ఆయుర్వేద లెక్చరర్స్/ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకిగానూ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
వైద్యుల భర్తీనే కాకుండా.. ఫుడ్ సేఫ్టీ ఆఫీర్స్ విభాగంలోనూ పోస్టులను భర్తీ చేయనుంది.
11/2022 నోటిఫికేషన్ కింద 8 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డిస్ట్రిక్ ప్రొహిబిషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్‌లో 12 శాంపిల్ టేకర్ పోస్టులతోపాటు ఇతర పోస్టులు కలిపి మొత్తం 45 ఉన్నాయి.
పోస్టులకు సంబంధించిన తగిన సమాచారం తెలుసుకోవాలనుకున్నవారు ఏపిపిఎస్సి రిక్రూట్మెంట్ సైట్‌ని లేదా ఏపీపీఎస్సి జాబ్స్ సైట్ ద్వారా కనుక్కోవచ్చు.
0 Comments:
Post a Comment