Search This Blog

Thursday, 8 September 2022

SBI Jobs - State Bank of India Recruitment 2022 : Apply online for Junior Associates vacancies || Last date : September 27, 2022

State Bank of India Recruitment 2022 : Apply online for Junior Associates vacancies  || Last date : September 27, 2022

State Bank of India Recruitment 2022 : Apply online for Junior Associates vacancies  || Last date : September 27, 2022

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని ఆతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద ద్వారా 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరులో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం పోస్టులు:5008

వివరాలు....

విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా 

తత్సమాన విద్యార్హత ఉండాలి. డిగ్రీ ఫైనల్/

చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28

ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ (జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.1,99,00.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు:  ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా. స్థానిక భాష (లోకల్ లాంగ్వేజ్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం:

I. ప్రిలిమినరీ పరీక్ష:

మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

II. మెయిన్ ఎగ్జామ్:

మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష 

ప్రశ్నలు ఉంటాయి.ఇందులో నాలుగు విభాగాలు

ఉంటుంది. మొత్తం 190 ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

• ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:27.09.2022.

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 12.10.2022.

ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్, 2022లో.

• మెయిన్ పరీక్ష తేది: జనవరి 2023లో ఉంటుంది.

SBI Clerks Recruitment 2022  Online Apply Link

SBI Clerks Recruitment 2022 Notification download

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top