Search This Blog

Monday, 19 September 2022

MEO posts newsటీచర్ పోస్టులు రద్దు చేసి MEO పోస్టు లు సృష్టించడం హర్షణీయం కాదు...ఉమ్మడి సీనియార్టీ ప్రకారం ఎంఇఒ పోస్టులు

ప్రచురణార్ధం.    తేది : 18/9/2022

1145 టీచర్ పోస్టులు రద్దు చేసి MEO పోస్టు లు సృష్టించడం హర్షణీయం కాదు...

ప్రాధమిక విద్య ని బతికించడానికి చర్యలు తీసుకోవాలి - టి ఎన్ యూ ఎస్.


విద్యా వ్యవస్థ కి ప్రాధమిక విద్య గుండెకాయ లాంటిది.అట్లాంటి ప్రాధమిక పాఠశాల  తరగతుల విలీనం తన ఉనికినే కోల్పోయింది. 

ప్రాధమిక పాఠశాల లో 3/4/5 తరగతులను హై స్కూల్ లో కలపడం వలన సగం మంది ఉపాధ్యాయులు హై స్కూళ్ల లో పనిచేస్తున్నారు. అనేక స్కూల్స్ సింగల్ టీచర్స్ తో ఉన్నాయి .ప్రాధమిక పాఠశాలలకు కావలసింది తగినన్ని SGT పోస్టులు అని SGT పోస్టులు లేకుండా తనిఖీ అధికారులు (MEO) దేనికని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అభిప్రాయం పడింది. 

మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక్క పోస్ట్ కూడా రద్దు చేయమని అన్నారని కానీ నేడు 1145 పోస్టు లు రద్దు చేసి హడావిడిగా జాబ్ చార్ట్ పై స్పష్టత కూడా లేకుండా MEO 1,MEO 2 లను వ్యవస్థలోకి చొప్పించడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని ముందుగా MEO జాబ్ చార్ట్ లపై స్పష్టత ఇవ్వాలని అదే విధంగా పంచాయితీ రాజ్ టీచర్స్ కి ప్రభుత్వ టీచర్స్ కి దామాషా ప్రకారం కేటాయించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ ,శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో డిమాండ్ చేసారు.

#TeluguNaduUpadhyayaSangham- #TNUS - #TeluguNaduTeachersFedaration- #TeluguNaduTeachersAssociation-  #తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం శ్రీనివాస్ #తెలుగునాడుఉపాధ్యాయసంఘం


✍️ప్రాథమిక పాఠశాలల విభజనతో నష్టం

🌻ఈనాడు, అమరావతి: ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపడంవల్ల సగం మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు వెళ్లారని, దీనివల్ల అనేక ప్రాథమిక పాఠశాలలను ఒకే టీచర్ తో నిర్వహించాల్సి వస్తోందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. 'ప్రాథమిక పాఠశాలలకు కావాల్సిన ఎస్ జీ టీ పోస్టులు లేకుండా తనిఖీ అధికారుల (ఎంఈవో) పోస్టులు ఎందుకు? ఒక్క పోస్టును రద్దు చేయబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరో పక్క 1145 పోస్టులు రద్దు చేసి హడావుడిగా జాబ్ చార్ట్ప స్పష్టత లేకుండా ఎంఈవోలను వ్యవస్థలోకి చొప్పించడం ఏంటి? దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు దామాషా ప్రకారం కేటాయించాలి' అని వారు డిమాండు చేశారు. 

♦️ఎంఈవో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే..

కొత్తగా అప్ గ్రేడ్ చేసిన 679 ఎంఈవో పోస్టుల భర్తీకి సరైన మార్గదర్శ కాలు విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకుండా ప్రధానో పాధ్యాయుల నుంచి ఆప్షన్ తీసుకోవడం అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. 'ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల ఉమ్మడి సర్వీసు పరిగణనలోకి తీసుకుని ఎంఈవో 1, 2 నియామకాలు చేపట్టాలి. కొత్త ఎంఈవో పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఇప్పటివరకు సర్వీసులో ఉన్న సీనియర్ ఎంఈవోలకు బదిలీలు పూర్తి చేయాలి. ఉమ్మడి సర్వీసు రూల్స్ స్ఫూర్తికి ఇబ్బంది జరిగితే వెంటనే కార్యాచరణకు పిలుపునిస్తాం' అని వారు పేర్కొన్నారు.

#TeluguNaduUpadhyayaSangham- #TNUS - #TeluguNaduTeachersFedaration- #TeluguNaduTeachersAssociation-  #తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం శ్రీనివాస్ #తెలుగునాడుఉపాధ్యాయసంఘం


📚✍️ఉమ్మడి సీనియార్టీ ప్రకారం ఎంఇఒ పోస్టులు

♦️ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండ్

*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* రాష్ట్రప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఇఒ) పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ప్రకారం నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జివి నారాయణ రెడ్డి, వి శ్రీనివాసరావు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్కుమార్కు ఆదివారం లేఖ రాశారు. విద్యాశాఖ మంజూరు చేసిన 672 పోస్టులు పని విభజనకు సంబంధించిన నిబంధనలను రూపొందించలేదని తెలిపారు. సర్వీస్ రూల్స్ రూపొందించి పని విభజనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఇవోలను, ప్రధానోపాధ్యాయులను ఆప్షన్ అడగాలని కోరారు. 3శాతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 97శాతం పనిచేస్తున్న జిల్లా పరిషత్, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈ పోస్టులను ఏ విధంగా విభజిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇంటర్ విద్య ప్రవేశపెట్టిన 292

పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. 

♦️ఉమ్మడి నిబంధనల ప్రకారం మార్గదర్శకాలు ఎపిటిఎఫ్

ఎంఇవో పోస్టుల నియామకాలకు ఉమ్మడి నిబంధనల ప్రకారం మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యరమ్ములు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసును పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ స్ఫూర్తికి ఏమాత్రం ఇబ్బంది జరిగిన వెంటనే కార్యాచరణకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

♦️పోస్టులు రద్దు చేసి ఎంఇఒ పోస్టులా?: టిఎన్ యుఎస్

 1145 పోస్టులను రద్దు చేసి ఎంఇఒ పోస్టులు సృష్టించడం సరికాదని టిఎన్ యుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలకు తగినన్ని ఎసిటి పోస్టులు లేకుండా తనిఖీ అధికారులు దేనికని ప్రశ్నించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top