Search This Blog

Wednesday, 14 September 2022

Dragon Trees: 'వంద రకాల' డ్రాగన్‌ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!

 Dragon Trees: 'వంద రకాల' డ్రాగన్‌ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!

డ్రాగన్‌ ఫ్రూట్‌ పుష్కలంగా పోషకాలు కలిగి ఉండే పండు. అంతేకాదు, ఖరీదైనది కూడా. ఈ రెండు లక్షణాలూ 72 ఏళ్ల వృద్ధుడు జోసెఫ్‌ను రైతుగా మార్చేశాయి.
కేరళకు చెందిన ఆయన అమెరికా వెళ్లినప్పుడు తియ్యని డ్రాగన్‌ ఫ్రూట్‌ రుచి చూసి పరవశుడయ్యారు. ఏడేళ్ల క్రితం ఆ పండును ఏడు డాలర్లకు కొన్నారాయన. ఆ రుచి, కళ్లు చెదిరే ధర ఆయనను డ్రాగన్‌ రైతుగా మార్చేసింది.

హైదరాబాద్‌లో మెషిన్‌ టూల్‌ ఇండస్ట్రీ నిర్వహించి విరామ జీవనం గడుపుతున్న జోసెఫ్‌.. తన స్వస్థలం కొట్టాయం దగ్గర్లోని చెంగనస్సెరీకి తిరిగి వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక దేశ విదేశాల నుంచి డ్రాగన్‌ మొక్కల్ని సేకరించటం మొదలు పెట్టారు. ఈక్వడార్, తైవాన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి డ్రాగన్‌ మొక్కల్ని తెప్పించి ఇంటి పెరట్లోని 65 సెంట్ల స్థలంలో నాటారు.

100 రకాలు
ఇప్పటికి దాదాపు 100 రకాలు సేకరించారు. అందులో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయంటారు జోసెఫ్‌. కొన్ని రకాల పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నిటికి ఎర్రగా, పసుపు పచ్చగానూ ఉంటాయి. డ్రాగన్‌ జీవవైవిధ్యంతో ఆయన పెరటి తోట కళకళలాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రకాలను సంకరం చేసి 10 కొత్త డ్రాగన్‌ వంగడాలను రూపొందించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.

65 రోజులకు పండు కోతకు
వీటిల్లో జేకే1 పలోరా 2, రెడ్‌ చిల్లీ, వండర్‌ బాయ్‌ జేకే 2 అనే రకాల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. జేకే1 పలోరా 2 రకం పసుపు రంగు పండు అన్నిటికన్నా తియ్యనిది (బ్రిక్స్‌ 23.6). పూత వచ్చాక 65 రోజులకు పండు కోతకు వస్తుందని ఆయన 'సాక్షి సాగుబడి'తో చెప్పారు.

తన డ్రాగన్‌ పండ్ల రంగు, రుచిని బట్టి.. ఒక్కో మొక్కను రూ. వంద నుంచి 4,000 వరకు విక్రయిస్తుండటం విశేషం. వండర్‌ బాయ్‌ జేకే 2 రకం (క్రాస్‌ పాలినేషన్‌ రకం) పండు తియ్యదనం బ్రిక్స్‌ 21.5. ఈ మొక్క ధర రూ. 1,500. రెడ్‌ చిల్లీ పండు తియ్యదనం బ్రిక్స్‌ 17.5. దీని కటింగ్‌ను రూ. వెయ్యికి అమ్ముతున్నారాయన. అన్నట్టు.. మొక్కలతో పాటు పండ్లను కూడా అమ్ముతున్నారు జోసెఫ్‌(94472 94236). అనేక రాష్ట్రాల్లో తన కస్టమర్లున్నారని ఆయన అంటున్నారు కించిత్‌ గర్వంగా!


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top