Search This Blog

Friday, 9 September 2022

పాఠశాలల్లో పోస్టుల హేతుబద్ధీకరణ

 పాఠశాలల్లో పోస్టుల హేతుబద్ధీకరణ

700 మందికి పైగా మిగులు ఉపాధ్యాయులు

నేడు కలెక్టర్ల సంతకంతో సీఎస్‌ఈకి దస్త్రం

ఈనాడు-అమరావతి

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించి గతంలో నిర్వహించిన కసరత్తులో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని తిరిగి సవరించి జిల్లా పాలనాధికారుల సంతకంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు దస్త్రాన్ని పంపడానికి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇవి శుక్రవారం నాటికి అందజేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. దీంతో గురువారం మూడు జిల్లాల్లో ఈ కసరత్తు జరిగింది. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తప్పులు గుర్తించి డీఈవో దృష్టికి తీసుకొచ్చినవి సవరించారు. పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పాఠశాలల మ్యాపింగ్‌, మిగులు పోస్టులు గుర్తింపు, ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉంటే ఆ వివరాలను జిల్లా విద్యాశాఖలు కసరత్తు చేసి లోగడ ఒకసారి ప్రభుత్వానికి పంపారు. అప్పట్లో మే 31 నాటికి ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ కసరత్తు చేపట్టారు. దానిపై అభ్యంతరం రావడంతో ఆగస్టు 31 వరకు ఛైల్డు ఇన్‌ఫోలో ఉన్న ప్రవేశాల ఆధారంగా హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియను పూర్తి చేశారు. వాటి ఆధారంగా ఈనెల 2, 3, 4 తేదీల్లో విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఐటీ విభాగాల సిబ్బందితో సమావేశమై ఈ కసరత్తును అధ్యయనం చేశారు. ఇంకా ఏమైనా మార్పు, చేర్పులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ల ఆమోదం పొందిన దస్త్రాలను స్వయంగా డీఈవోలే కమిషనరేట్‌కు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ మూడు జిల్లాల సమాచారాన్ని క్రోడీకరించి దస్త్రాన్ని పంపే బాధ్యతను గుంటూరు డీఈవోకు అప్పగించారు.


600 మందికి పదోన్నతులు!

ఉమ్మడి గుంటూరులో 700 మందికి పైగా సెకండరీగ్రేడ్‌ టీచర్లు మిగులుగా(సర్‌ప్లస్‌) గుర్తించారు. టీచర్ల కొరత ఎక్కడైతే ఉందో వారిని అక్కడకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా 600 మందికి పైగా ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు రాబోతున్నాయి. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న 14 పాఠశాలల్లో హెచ్‌ఎంల పోస్టులు పోతున్నాయి. ఇక మీదట ఆ స్కూళ్లల్లో స్కూల్‌ అసిస్టెంట్లలో సీనియర్‌ ఒకరు హెచ్‌ఎం బాధ్యతల్లో రాణిస్తారు. మొత్తంగా పోస్టుల హేతుబద్ధీకరణతో కొంతమంది ఎస్‌జీటీలకు పదోన్నతులు, స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా వ్యవహరించే అవకాశం, మిగులు ఉపాధ్యాయులకు అవసరం ఉన్నచోట పనిచేసే అవకాశం రానుంది. ఇప్పటి వరకు ఈ రకమైన కసరత్తు జరగకపోవడంతో అసలు పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి ఒక ప్రామాణికం లేకుండా పోయింది. మిగులు ఉపాధ్యాయులు డీఈవో పూల్‌ కోటాలోకి వెళ్లిపోయేవారు. వారు డీఈవో చెప్పిన పనులు చేసుకుంటూ కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. అయితే హేతుబద్ధీకరణ పుణ్యమా అని మిగులు ఉపాధ్యాయులను పక్కాగా లెక్క తేల్చడంతో వారిని ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ స్కూళ్లకు పంపి వారి సేవలు వినియోగించుకోవడం ద్వారా విద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల 93 మంది విద్యార్థుల లోపు ఉన్న స్కూళ్లకు హెచ్‌ఎం పోస్టులు కోల్పోవాల్సి ఉండడంతో కొందరు ప్రధానోపాధ్యాయులు దీని నిర్వహణ వల్ల తమకు ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. మే నెలలో నిర్వహించిన కసరత్తుతో పోస్టుల హేతుబద్ధీకరణ చేపడితే సుమారు వెయ్యి మందికి పైగా పదోన్నతులు వచ్చేవి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూళ్ల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు తక్కువగా రావడంతో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా వేలాది మంది పిల్లలు సర్కారీ బడుల నుంచి వెళ్లిపోయారు. మరికొందరు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వలసలు వెళ్లారు. దీంతో ప్రవేశాలు తగ్గడంతో ఆ మేరకు పోస్టులు తగ్గిపోయాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఆగస్టు 31 తర్వాత కూడా చాలామంది పిల్లల పేర్లు ఛైల్డుఇన్‌ఫోలో ఎక్కాయని వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని హేతుబద్ధీకరణ చేపట్టాలని సంఘాలుగా తాము కోరుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఒకరిద్దరు సంఘ నాయకులు తెలిపారు.


విద్యాశాఖ అధికారుల కసరత్తు

హేతబద్ధీకరణపై ఈనెల 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఐటీ విభాగాల సిబ్బందితో సమావేశమై కసరత్తును అధ్యయనం చేశారు. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ల ఆమోదం పొందిన దస్త్రాలను స్వయంగా డీఈవోలే కమిషనరేట్‌కు అందజేయాలని స్పష్టం చేయడంతో మూడు జిల్లాల డీఈవోలు ఈ ప్రక్రియ నిర్వహణలో గురువారం అంతా బిజీగా గడిపారు. ఈ మూడు జిల్లాల సమాచారాన్ని క్రోడీకరించి దస్త్రాన్ని పంపే బాధ్యతను గుంటూరు డీఈవోకు అప్పగించారు.


*బదిలీల ఫైల్ ప్రస్తుతం గౌ౹౹  సీఎం గారి వద్దనే....ఇంకా ఆమోదం  కాలేదు.*


నేడు జేడి సర్వీసెస్ పాఠశాల విద్య శ్రీ.మువ్వా రామలింగం గారు & స్టాఫ్ తో కలసిన సందర్భంగా తెలిసిన & అంచనా వేసుకున్న విషయాలు క్లుప్తంగా...


🔹 *రీ అప్పోర్షమెంట్:*                   (రేషనలైజేషన్) ఈ ప్రక్రియ 31.08.2022 కట్ ఆఫ్ డేట్ ప్రాతిపదికన పూర్తి అయ్యింది. ఐతే ఆయా జిల్లాల నుండి కలెక్టర్ల అనుమతి రావాల్సి ఉంది. ఒక కి.మీ పరిధి, ఆటంకాలు అన్నీ పరిగణలోకి తీసుకొన్నా 5300 పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు హై స్కూల్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. జి. వో లు 117,128 ఆధారంగానే ముందుకెళ్తున్నారు. 1 - 7 తరగతుల వరకు ఒకే మీడియం, ప్రాథమిక తరగతుల విలీనం, 36 గరిష్ట పీరియడ్స్ కేటాయింపు, మార్పు చేయని ఉపాధ్యాయ: విద్యార్థి నిష్పత్తి తదితర కారణాలతో భారీగా పోస్టులు సర్ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లో అవసరమైన చోట MTS (2008 & 1998 DSC) క్వాలిఫైడ్ వారిని వేసే అవకాశం ఉంది. ఇక నూతన DSC అనుమానమే. 


*🔹పదోన్నతులు:* ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ అప్గ్రడేషన్ 4400 , Gr-2 HM's పోస్టులు 998 ఆర్థిక శాఖ అనుమతి పొందడం తెలిసిందే. 697 మండలాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న యం ఈ ఓ  248 పోస్టుల భర్తీ మరియు రెండవ యం ఈ ఓ పోస్టులు 697, Dy EO 74  నూతన పోస్టుల పదోన్నతులకు సంబందించిన ఫైల్ ఆర్థిక శాఖలో వుంది. 


#కర్నూలు జిల్లాకు కావలసిన దాదాపు 2800 పోస్టుల సర్దుబాటు పెండింగ్లో ఉన్నాయి.


🔹 *బదిలీలు*:

కేవలం బదిలీలు చేసే పరిస్థితి వుండదు.పై రెండు ప్రక్రియలు రేషనలైజేషన్, పదోన్నతులతో ముడిపడి ఉంటుంది. MEO పదోన్నతులు డైరెక్ట్ గా ఇవ్వడం మరియు మిగతా HM, All SA's పదోన్నతులు మాత్రం పేపర్ మీద ఇవ్వడం జరుగును అనగా పదోన్నతి వస్తుంది కానీ ఇన్ సర్వీస్ వారి బదిలీల అనంతరం స్కూల్స్ కేటాయింపు జరుగును. బదిలీల ఫైల్ ప్రస్తుతం సీఎం గారి వద్ద ఉన్నది. కర్నూలు జిల్లా కు చెందిన పండిట్స్, పి ఈ టీ / పి.డి ల హైకోర్టు లో వున్న కేసు సోమవారానికి వాయిదా పడింది. (ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు).

ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నందున ఇప్పటికిప్పుడే అన్ని జరిగిపోతాయి అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఏదైనా షెడ్యూల్ వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి.


🔹 LFL HM 's - SA's గా కన్వర్షన్ ఇచ్చిన వారి సీనియారిటి ఆ పదోన్నతి పొందిన తేదీ నుండి పరిగణించి జాబితాలో వుంచడం, స్టేషన్ & టోటల్ సర్వీస్ తీసుకొని బదిలీ చేయడం జరుగును.


*🔹మున్సిపల్ టీచర్ల సమస్యలు*: 

సోదర సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు

జి.వో 40 ప్రకారం HM లు DDO లుగా మార్పు చేయుటకు పాలసీ మేటర్ కాబట్టి GAD లో ప్రాసెస్ లో వుంది. అదీ పూర్తి అయ్యే వరకు ప్రస్తుతం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు టీచర్లకు లోకల్ MEO, హై స్కూల్ టీచర్లకు DyEO ల డ్రాయింగ్ ఆఫీసర్స్ ద్వారా తాత్కాలికంగా జీతాలు మంజూరు చేయడం జరుగును.

🔹 GPF విషయంపై తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు

🔹 పదోన్నతులు, బదిలీలు ZP/ Govt టీచర్లవి కొలిక్కి వచ్చాక చేపడతామని అన్నారు.


.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top