Search This Blog

Sunday, 4 September 2022

Teachers Day 2022 - boycott by Unions. టీచర్స్‌ డే వేడుకలు బహిష్కరణ : ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం* 👉రాష్ట్ర చరిత్రలో మొదటిసారి

 Teachers Day 2022 - boycott by Unions

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

*టీచర్స్‌ డే వేడుకలు బహిష్కరణ : ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం* 

👉రాష్ట్ర చరిత్రలో మొదటిసారి

 *ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :* టీచర్స్‌ డే సందర్భంగా సెప్టెంబర్‌ 5 (సోమవారం)న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న వేడుకలను బహిష్కరిస్తున్నట్లు వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల జాబితాను శనివారం ప్రకటించింది. ఆ తరువాత కాసేపటికే ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం వెలువడింది. యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌(1938), ఎపిటిఎఫ్‌(257), టిఎన్‌యుఎస్‌, నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌లు ప్రకటనలు విడుదల చేశాయి. కొనిు జిల్లాల్లో ఉపాధ్యాయ ఐక్యవేదిక పేరుతో వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఇదే విషయానిు తెలియచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వేధింపులను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులకు వినతిపత్రాలను కూడా అందచేశారు. ఈ ఐక్యవేదికల్లో అధికార వైసిపి అనుబంధ ఉపాధ్యాయ సంఘం వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ కూడా ఉండటం విశేషం. టీచర్స్‌ డే ఉత్సవాలను బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. అయితే, ఉపాధ్యాయ సంఘాల బహిష్కరణ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 *ఎందుకీ నిర్ణయం ?* 
ప్రభుత్వ వేధింపు చర్యలకు నిరసనగానే ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సిపిఎస్‌ రద్దు చేసి, దాని స్థానంలో ఒపిఎస్‌ అమలు కోసం నిర్వహిస్తున్న ఆందోళనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దమనకాండకు దగిన విషయం తెలిసిందే. ఇంతకు ముదు ఎన్నడూ లేని విధంగా వందలాది మంది ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం బైండోవర్‌ కేసులు పెట్టింది. ముందస్తు అరెస్ట్‌లు చేసింది. 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేసింది. సెల్‌ఫోన్‌, సొంత వాహానాలు సీజ్‌ చేయడం పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం వంటి చర్యలతో వారిపై ఉక్కుపాదం మోపింది. మహిళా ఉపాధ్యాయుల ఇళ్లకు సైతం రాత్రిపూట వెళ్లి భయభ్రాంతులకు గురిచేసింది. అంతకు ముందు ఫిబ్రవరి 3వ తేదిన జరిగిన పిఆర్‌సి ఉద్యమం సందర్భంలో కూడా రాష్ట్రప్రభుత్వం ఇదేవిధంగా నిర్బంధ చర్యలకు దిగింది. అయితే ఈ పోరాటానిు ప్రభుత్వం ఆపలేకపోయింది. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద తమను కాపలాగా ఉంచినప్పటి నుండి ఈ వేధింపులు ప్రారంభమయ్యాయని ఉపాధ్యాయులు చెబుతునాురు. అదే సమయంలో బోధనేతర పనుల నుంచి, యాప్‌ల భారం నుంచి తమను తప్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోగా, మరిన్ని కొత్త యాప్‌లను తీసుకొస్తూ వారిపై పనిభారం మోపుతోంది. పదేపదే మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 *మానసికంగా ఇబ్బందులు : యుటిఎఫ్‌* 

రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఉనాధ్యాయులను తరచు పోలీస్‌ స్టేషన్లకుపిలిచి వేధిస్తున్నారని, పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విజయవాడ వెళ్తున్నట్లుగా తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని, విధ్వంసం సృష్టించాలని ఉపాధ్యాయులు మాట్లాడుకుంటున్నట్లు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు రూపొందిస్తున్నారని, ఒక పోలీస్‌ స్టేషన్‌ నుండి మరో పోలీస్‌ స్టేషన్‌కు దొంగల్లాగా తిప్పుతున్నారని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.

 *నిరంకుశ వైఖరి : ఎపిటిఎఫ్‌ (1938)* 

ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తుందని ఎపిటిఎఫ్‌˜ (1938) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి పేర్కొన్నారు. తమ హక్కులను హరిస్తున్న ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం జరుపుతున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తునుట్లు వెల్లడించారు.

 *అవమానపరుస్తోంది : ఎపిటిఎఫ్‌ (257)* 
ఉపాధ్యాయులను ప్రభుత్వం అదేపనిగా అవమాన పరుస్తూ, నిర్బందాలకు గురిచేస్తోందని ఎపిటిఎఫ్‌(257) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ మంజుల, కె.భానుమూర్తి తెలిపారు.ఉపాధ్యాయుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

 *కేసులు తగదు:* టిఎన్‌యుఎస్‌
ఉపాధ్యాయులపై అకారణంగా పెద్దసంఖ్యలో నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం దారుణమని టిఎన్‌యుఎస్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనుం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టడం, పిల్లల ముందే పాఠశాలల్లోకి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు.

నైతిక హక్కు లేదు : నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌
రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దమన నీతి ప్రదర్శిస్తూ మరోపక్క అవార్డులు ప్రధానం చేయడం గర్హనీయమని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, ఎన్‌ వెంకట్రావు విమర్శించారు. ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయకుండా ఉపాధ్యాయ దినోత్సవం చేసే నైతిక హక్కును ప్రభుత్వం కోల్పోయిందని తెలిపారు.

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

*📚✍️మీ సత్కారం మాకొద్దు✍️📚*

*♦️కేసులు, అరెస్టులతో అవమానించారు*

*♦️ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాల తీవ్ర నిరసన*

*♦️గురుపూజోత్సవ వేడుకలకు దూరం.. పలు సంఘాల కీలక నిర్ణయం*

*🌻అమరావతి/విజయవాడ/అనంతపురం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి)*: మొన్నటికి మొన్న నోటీసులు, కేసులు, అరెస్టులతో అవమానించి.. ఇప్పుడు గురువులకు సత్కారం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. గురుపూజోత్సవం(సెప్టెంబరు 5) వేళ ఆ వేడుకలకు దూరంగా ఉండాలని పలు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య, రెండు ఉపాధ్యాయ సంఘాలు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, నోబుల్‌ టీచర్ల సంఘం ఈ మేరకు పిలుపునిచ్చాయి. సీపీఎస్‌ రద్దు కోసం ఇటీవల నిర్వహించాలని భావించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం సమయంలో ప్రభుత్వం టీచర్ల పట్ల అవమానకరంగా వ్యవహరించిందని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీచర్లపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు, బైండోవర్లు ప్రయోగించి ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ నిలదీశాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులెవరూ పాల్గొనవద్దని పిలుపునిచ్చాయి.

*♦️టీచర్లపై కర్కశంగా కేసులు: యూటీఎఫ్‌*

సీపీఎస్‌ రద్దు ఆందోళనల సమయంలో సాధారణ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కర్కశంగా కేసులు పెట్టిందని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. టీచర్లపై కేసులు, బైండోవర్లను నిరసిస్తూ ఈనెల 5న ప్రభుత్వం నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. అన్ని మండల, పట్టణ యూనిట్లలో దీనిని అమలుచేస్తామన్నారు.

*♦️టీచర్లను అవమానిస్తున్నారు:ఏపీటీఎఫ్‌257*

ప్రభుత్వం టీచర్లను అదే పనిగా అవమానిస్తోందని ఏపీటీఎఫ్‌257 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ మంజుల, కె.భానుమూర్తి విమర్శించారు. పోలీస్‌ స్టేషన్లలో రాత్రుళ్లు నిర్బంధిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, రూ.2 లక్షల పూచీకత్తుతో బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దుచేయాలని అడిగినవారిపై అక్రమ కేసులు పెడుతున్నందున ఈ ఏడాది గురుపూజోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. 

*♦️గురుపూజోత్సవానికి దూరం: టీఎన్‌యూఎస్‌*

ఉపాధ్యాయులపై అకారణంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కేసుల నమోదు, పాఠశాలల్లోకి వచ్చి నోటీసులు ఇవ్వడం, స్టేషన్లకు తీసుకెళ్లడం లాంటి చర్యలను నిరసిస్తూ గురుపూజోత్సవాన్ని బహరిష్కరిస్తున్నామన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీనే అమలుచేయమంటే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.  

*♦️ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత*

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవంపై టీచర్లు వ్యతిరేకత చూపుతున్నారని ఏపీటీఎఫ్‌ 257 అనంతపురం జిల్లా నాయకులు పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఉపాధ్యాయభన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను సీఎం జగన్‌ రద్దు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే సత్కారాలను, సన్మానాలను తిరస్కరిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏపీటీఎఫ్‌ 1938 అనంతపురం జిల్లా నాయకులు కూడా ఉపాధ్యాయ దినోత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అనంతపురం డీఈవోకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, ప్రధానకార్యదర్శి శ్రీనివాసురెడ్డి వినతిపత్రాన్ని అందించారు.   

*♦️అటు కేసులు... ఇటు సత్కారాలా?: ఏపీటీఎఫ్‌ 1938*

ఓవైపు కేసులు, జైళ్లు, యాప్‌లు అంటూ ఒత్తిడి చేస్తూ మరోవైపు శాలువాలతో సత్కారాలు చేస్తామంటే ఎలాగని ఏపీటీఎఫ్‌1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, ఎస్‌. చిరంజీవి ప్రశ్నించారు. తరగతి గదిలో బోధనా స్వేచ్ఛను కలిగిస్తే దానినే ఘన సన్మానంగా భావిస్తామన్నారు. 

*♦️అవమానిస్తూ అవార్డులా?: నోబుల్‌ టీచర్ల సంఘం*

సీఎం జగన్‌ ఇచ్చిన హామీ సీపీఎస్‌ రద్దును అమలు చేయాలని కోరిన టీచర్లపై కేసులు పెట్టి అవమానించి, ఇప్పుడు సత్కారాలు చేస్తున్నారా అని నోబుల్‌ టీచర్స్‌ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, నడిపినేని వెంకట్రావు ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ఎత్తివేయకుండా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేశారు. తక్షణం టీచర్లపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.   

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top