NEET 2022: నీట్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ .. తగ్గించనున్న కటాఫ్ మార్కులు ! ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!
జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ ఏడాది నీట్ పరీక్ష ఇటీవల ముగిసింది. దేశంలో 497 నగరాలతో పాటు, విదేశాల్లో 14 నగరాల్లో నిర్వహించారు. అభ్యర్థులంతా ఇప్పుడు నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మెడికల్(Medical) అడ్మిషన్స్ పొందడానికి నీట్లో ఎంత స్కోర్ (Score)అవసరమో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే గత నాలుగేళ్ల కాలంలో నీట్ కటాఫ్ పర్సంటైల్ వివరాలను పరిశీలించండి.
నీట్-2021 కటాఫ్ పర్సంటైల్- స్కోర్
గతేడాది నీట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి కటాఫ్ పర్సంటైల్ 50 కాగా, కటాఫ్ స్కోర్ 138- 720 మార్కుల మధ్య ఉండేది. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ 40, కటాఫ్ స్కోర్ 108 - 137 మార్కులు. అన్రిజర్వ్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ (PH) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకైతే 122- 137 మార్కులు కటాఫ్‌గా, 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
నీట్-2020 కటాఫ్ పర్సంటైల్- స్కోర్
2020లో అన్రిజర్వ్డ్ కేటగిరీ కటాఫ్ పర్సంటైల్ 50, కటాఫ్ స్కోర్ 147 నుంచి 720 మార్కుల మధ్య నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ 40 కాగా, కటాఫ్ స్కోరు 113 - 146 మార్కుల మధ్య ఉండేది. అన్రిజర్వ్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ (PH) అభ్యర్థులకు 129 - 146 మార్కులు, 45 పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు.
నీట్-2019 కటాఫ్ పర్సంటైల్- స్కోర్స్
అన్రిజర్వ్డ్ కేటగిరీ కటాఫ్ పర్సంటైల్ 50 శాతం కాగా, 134 నుంచి 701 మధ్య మార్కులను కటాఫ్ స్కోర్‌గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులతే 40 పర్సంటైల్ పొందడానికి 107-133 మధ్య స్కోర్ చేయాల్సి ఉండేది. ఇక అన్‌రిజర్వడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ (PH) అభ్యర్థులకు 133-120 స్కోర్‌తో 45 పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు.
నీట్-2018 కటాఫ్ పర్సంటైల్-స్కోర్
అన్ రిజర్వ్డ్(UR) అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ 50, కటాఫ్ స్కోర్స్ 119- 691 మార్కుల మధ్య ఉండేది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు 96- 118 మార్కులను కటాఫ్ స్కోర్‌గా, 40 కటాఫ్ పర్సంటైల్‌గా ఉండేంది. వికలాంగ అభ్యర్థులకైతే 107-118 మార్కులు, 45 పర్సంటైల్ కటాఫ్‌గా నిర్ణయించారు.
ప్రతి ఏటా నీట్ కోసం రెండు వేర్వేరు కటాఫ్‌లను విడుదల చేస్తారు. మొదటిది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల సంఖ్యను సూచించే క్వాలిఫైయింగ్ కటాఫ్. దీని తర్వాత అడ్మిషన్ కటాఫ్ ఉంటుంది. దీని ఆధారంగా ప్రవేశాలకు ర్యాంకు(Ranks)లు కేటాయిస్తారు.
నీట్ -2022 కటాఫ్ (ఎక్స్పెక్టెడ్)
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పాస్ కావాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించాలి. ఈ ఏడాది నీట్ కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కటాఫ్ కూడా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే, నీట్ 2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. కాగా, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, పరీక్ష క్లిష్టత స్థాయి వంటి అనేక అంశాలపై కటాఫ్ స్కోర్ ఆధారపడి ఉంటుంది.
0 Comments:
Post a Comment